India vs South Africa Test Team | టీమ్ ను ప్రకటించిన దక్షిణాఫ్రికా
టీమ్ ను ప్రకటించిన దక్షిణాఫ్రికా : నవంబర్ నెలలో దక్షిణాఫ్రికా భారత్ పర్యటనకు రానుంది. ఇందులో భాగంగా 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20 సిరీస్‌లను ఆడనుంది. కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ రెండో హోమ్ టెస్ట్ సిరీస్ ఇదే కావద్దం విశేషం.
భారత్‌తో జరిగే టెస్ట్ సిరీస్ కోసం.. దక్షిణాఫ్రికా 15 మంది సభ్యులతో జట్టును ప్రకటించింది. పాకిస్థాన్‌తో సిరీస్‌కు దూరమైన తెంబా బవుమా తిరిగి టీమ్ లో చోటు దక్కించుకున్నాడు. ఈ సిరీస్‌కు బవుమా కెప్టెన్‌గా ఉండనున్నాడు. అయితే బవుమా టీమ్ లో చోటు దక్కించుకోవడంతో.. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ డేవిడ్ బెడింగ్‌హామ్‌ను టీమ్ లో నుంచి తప్పించారు. భారత్ పిచ్‌లపై స్పిన్ కు అనుకూలంగా ఉంటుంది కాబట్టి జుబేర్ హంజాకు స్థానం దక్కింది. స్పిన్నర్లుగా కేశవ్ మహారాజ్, సైమన్ హార్మర్, సెనురన్ ముత్తుస్వామి ఉన్నారు. కాగిసో రబాడా, కార్బిన్ బాష్, మార్కో యాన్సెన్ పెసర్లుగా ఉండనున్నారు. అయితే ఈ సిరీస్ కోసం ఇండియా టీమ్ ను ఇంకా ప్రకటించలేదు.





















