India vs Oman Bowling Asia Cup 2025 | ఒమన్ పై విఫలమైన ఇండియా బౌలర్లు
ఆసియా కప్ లో టీమ్ ఇండియా జోరుమీద ఉంది. వరుసగా మూడు విజయాలను అందుకుంది. UAE, పాకిస్తాన్ తో జరిగిన మ్యాచులో అదరగొట్టిన టీమ్ ఇండియా ఒమన్ తో జరిగిన మ్యాచ్ లో కాస్త స్లో అయిందనే చెప్పాలి. కేవలం 21 పరుగుల తేడాతో ఇండియా ఒమన్ పై గెలిచింది. అయితే ఇది టీమ్ ఇండియా గెలించేంత స్థాయి విజయం కాదని అంటున్నారు ఫ్యాన్స్. ఈ మ్యాచ్ లో బౌలింగ్ పరంగా ఇండియా దారుణంగా విఫలం అయిందని క్రికెట్ అభిమానులు అంటున్నారు.
ఇండియా vs ఒమన్ మ్యాచ్‌లో బుమ్రా, వరుణ్ చక్రవర్తి ఆడలేదు. వారికీ రెస్ట్ ఇచ్చారు. హార్ధిక్ పాండ్యా, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, శివమ్ దూబేతో ఇండియా మ్యాచ్ ను మొదలు పెట్టింది. ఒమాన్ ముందు ఇండియా 188 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. కానీ మన వాళ్లు పవర్ ప్లేలో ఒక్క వికెట్ కూడా తీయలేక పొయ్యారు. ఒమన్ టాపార్డర్ బ్యాటర్లు చాలా అద్భుతంగా ఆడారు. మొత్తంగా 8 మంది బౌలర్లను ప్లేయింగ్ 11 లో ఉంచి కెప్టెన్ సూర్యకుమార్ ప్రయోగం చేసాడు. కానీ నలుగు మాత్రమే వికెట్ పడగొట్టారు. మరి ముందు జరగబోయే మ్యాచులో బౌలర్ల ప్రదర్శన ఎలా ఉంటుందిది చూడాలి.





















