IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు పోరాటం ముగిసింది. సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైంది. లార్డ్స్ వేదికగా జరిగిన హై-టెన్షన్ మ్యాచ్‌లో మైటీ ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 170 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 27 బంతుల్లో 56 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. 171 పరుగుల రికార్డ్ స్థాయి లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ జార్జ్ వాల్‌ను రేణుకా సింగ్ తొలి ఓవర్లోనే అవుట్ చేసింది. ఆ తర్వాత లీచ్ ఫీల్డ్, బెత్ మూనీ ఇన్నింగ్స్ చక్కదిద్దారు. భారత బౌలర్ శ్రీ చరణి రెండు వికెట్లు తీసి పార్ట్‌నర్‌షిప్‌ను బ్రేక్ చేసినా.. ఆసీస్ మిడిలార్డర్ పుంజుకుంది.
తీవ్ర ఒత్తిడిలో స్టార్ ఆల్ రౌండర్ ఎలీస్ పెర్రీ, యాష్లీ గార్డెనర్ సంచలన హాఫ్ సెంచరీలతో చెలరేగారు. కేవలం 19 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసి ఆసీస్‌ను గెలిపించారు. ఈ ఓటమితో టీమిండియా టోర్నీ నుంచి నిష్క్రమించగా.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లు సెమీస్‌కు దూసుకెళ్లాయి.
ట్రెండింగ్ వార్తలు






















