Virat Kohli 76 Runs in T20 World Cup Final | సిరీస్ అంతా ఫెయిలైనా ఫైనల్ లో విరాట్ విశ్వరూపం | ABP
కల్కి సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. అవసరమైన టైమ్ లో ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్...అమితాబ్ బచ్చన్ తో అంటాడు ఆలస్యమైందా ఆచార్య పుత్రా అని. అది ఫర్ ఫెక్ట్ సిచ్యుయేషన్ లో పడుతుంది డైలాగ్. సేమ్ టూ సేమ్ నిన్న కొహ్లీ బ్యాటింగ్ కూడా అంతే. ఈ వరల్డ్ కప్ ఇప్పటివరకూ ఫెయిల్ అవుతూ వచ్చిన విరాట్ కొహ్లీ..సరిగ్గా ఫైనల్ కి వచ్చేసరికి విశ్వరూపం చూపించాడు. మిగిలిన టాప్ ఆర్డర్ అంతా ఫెయిలైన రోజున తనదైన బ్యాటింగ్ ను బయటకు తీసి ఫామ్ లేకున్న కింగ్ కింగేరా అన్నట్లు సౌతాఫ్రికా బౌలర్లను ఉతికిపారేశాడు. బ్యాటింగ్ కు కఠినమైన పరిస్థితులున్న చోట 59బంతులు ఎదుర్కొన్న విరాట్ ఆరు ఫోర్లు 2సిక్సర్లతో 76పరుగులు చేసి ఫైనల్లో టీమిండియాకు మంచి స్కోరు అందించటంలో కీలకమయ్యాడు. విరాట్ ధాటికి 34 కే 3వికెట్లు కోల్పోయిన దశ నుంచి కోలుకుని 176పరుగులు చేయగలిగింది భారత్. ఈ ఫైనల్ కి ముందే రోహిత్ శర్మ చెప్పాడు..విరాట్ ఆడటం లేదనే కంగారు వద్దు ఫైనల్లో బాగా ఆడటానికి ఎనర్జీ సేవ్ చేసుకుంటున్నాడేమో అన్నాడు. అన్నట్లుగా నే ప్రెజర్ సిచ్యుయేషన్స్ లో తనలోని సిసిలైన ఆటగాడిని బయటకు తీసిన కొహ్లీ భారత్ వరల్డ్ కప్ ను సగర్వంగా ఎత్తుకోవటంలో ప్రధాన పాత్ర పోషించాడు. అందుకే వరల్డ్ కప్ ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విరాట్ కొహ్లీనే వరించింది. వరల్డ్ కప్ కలను నెరవేర్చుకుని తన కెరీర్ లో తొలి టీ20 వరల్డ్ కప్ ను అందుకుని హ్యాపీగా టీ20లకు రిటైర్మెంట్ కూడా ఇచ్చేశాడు కింగ్ కొహ్లీ.