Shikhar Dhawan Announces Retirement | క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన శిఖర్ ధవన్ | ABP Desam
క్రికెట్ కు శిఖర్ ధవన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు ఓ వీడియో సందేశాన్ని తన ట్విట్టర్ లో ధవన్ పోస్ట్ చేశాడు. భారత్ తరపున 34టెస్టులు, 167 వన్డేలు, 68టీట్వంటీ మ్యాచ్ లను ఆడాడు ధవన్. రోహిత్ శర్మ తో కలిసి ఓపెనింగ్ చేస్తూ ఎన్నో చారిత్రాత్మక విజయాలను అందించాడు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ టీమిండియా గెలవటంతో ధవన్ ది కీలకపాత్ర. 38 ఏళ్ల శిఖర్ ధవన్ ను టీమిండియా క్రికెట్ లో అంతా గబ్బర్ అని పిలుస్తూ ఉంటారు. ఫియర్ లెస్ బ్యాటింగ్, అటాకింగ్ గేమ్ శిఖర్ ధవన్ స్పెషాలిటీ. సెహ్వాగ్ ను రీప్లేస్ చేస్తాడని భావించేంత స్థాయిలో ఓ టైమ్ లో రెచ్చిపోయాడు గబ్బర్. టెస్టుల్లోనూ స్పీడ్ బ్యాటింగ్ తో దుమ్మురేపాడు. ధవన్ గుండు పై గీతాల్లాంటి పొట్టి జుట్టు హెయిర్ స్టైల్ తో, ఫీల్డింగ్ లో క్యాచ్ పడితే తొడ కడుతూ చేసే సెలబ్రేషన్స్ అతనికంటూ ప్రత్యేకమైన గుర్తింపును తీసుకువచ్చాయి. రిటైర్మెంట్ ప్రకటన సందర్భంగా తన చిన్ననాటి కోచ్ లకు, బీసీసీఐకి, తనను ఇంతలా ప్రోత్సహించిన ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ కు ధవన్ కృతజ్ఞతలు తెలిపారు. టీమిండియాకు ఇకపై ఆడలేననే దానికంటే టీమిండియా తరపున క్రికెట్ ఆడాను అనే విషయమే తనకు ఎక్కువంటూ ఎమోషనల్ వీడియోను రిలీజ్ చేశాడు శిఖర్ ధవన్.