Surya Kumar Catch the World Cup | T20 World Cup 2024 లో భారత్ కు విజయాన్ని అందించిన క్యాచ్ | ABP
క్యాచెస్ విన్ మ్యాచెస్ అంటారు. క్రికెట్ లో ఎప్పుడూ వినిపించే వన్ లైనర్ ఇది. నిన్న మ్యాచ్ చూస్తే ఆ మాట విలువ ఎంత నిజమో తెలుస్తుంది. ఎందుకంటే సూర్య కుమార్ యాదవ్ పట్టిన ఈ ఒక్క క్యాచ్ మ్యాచ్ నే కాదు....ఏకంగా వరల్డ్ కప్ నే అందించింది. ఇన్నింగ్స్ లాస్ట్ ఓవర్ అది. అప్పటివరకూ చేసిన పోరాటం ఓ ఎత్తు. అదొక్కటి ఓ ఎత్తు. హార్దిక్ పాండ్యా చేతిలో బాల్ ఉంది. 16పరుగులు కొట్టాలి. క్రీజ్ లో ప్రమాదకర డేవిడ్ మిల్లర్ ఉన్నాడు. అప్పటికే చాలా సేపు రోహిత్ శర్మతో డిస్కస్ చేసిన పాండ్యా మొదటి బంతి వేశాడు. అంతే మిల్లర్ లాగి పెట్టి ఒక్కటి పీకాడు. అది ఆల్మోస్ట్ సిక్స్. ఇంక ఐదు బంతుల్లో పది పరుగులు మాత్రమే చేస్తే చాలు...సౌతాఫ్రికా కి వరల్డ్ కప్ అప్పగించాల్సిందే అని ఆల్మోస్ట్ భారత్ ఫ్యాన్స్ అంతా ఫిక్సయిపోయారు గాల్లోకి చాలా సేపు ప్రయాణం చేసిన బంతి క్రీజ్ కి కొన్ని ఇంచుల వెనుక పడపోయింది. అంతే సుడిగాలిగా దూసుకువచ్చాడు మన సూర్యు కుమార్ యాదవ్. క్రీజ్ దగ్గర ఎగిరి బంతిని పట్టుకున్నాడు. కిందకు ల్యాండ్ అయ్యేప్పుడు కాళ్లను క్రీజుకు తగలకుండా బాడీని అద్భుతంగా బ్యాలెన్స్ చేశాడు. కానీ ఆ స్పీడ్ లో బౌండరీలోకి వెళ్లిపోతున్నాడని అర్థం అయ్యింది. అంతే పట్టిన ఆ బాల్ ని కొంచెం గాల్లోకి పైకి ఎగరేశాడు. బౌండరీలో కాలు పెట్టి దిగాడు. మళ్లీ ఎగిరి గ్రౌండ్ లోకి వచ్చి ఎగరేసిన ఆ బాల్ ను క్యాచ్ పట్టేసుకున్నాడు. ఇదంతా చెప్పటానికి నాకు నిమిషం పట్టి ఉండొచ్చు కానీ ఈ పనిని సూర్యకుమార్ యాదవ్ కొన్ని సెకన్ల వ్యవధిలో పూర్తి చేశాడు. అది కూడా వందశాతం యాక్సురెసీతో అంతే. డేవిడ్ మిల్లర్ ఊహించని రీతిలో అవుటైపోయాడు. సౌతాఫ్రికా శిబిరంలో షాక్. ఐదు బంతుల్లో 16పరుగులుగా సమీకరణం మారిపోయింది. సౌతాఫ్రికా బౌలర్లకు ఆ టార్గెట్ కష్టమైపోయింది. ఐదో బంతికి రబాడా కూడా అవుట్. మళ్లీ సూర్యనే క్యాచ్. అంతే ఆల్మోస్ట్ సఫారీ చేతుల్లోకి వెళ్లిపోయిన ప్రపంచకప్ భారత్ చేతుల్లోకి వచ్చి పడింది. అందుకే ఈ ఫోటో ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతోంది. ఎందుకంటే ఆ క్షణం సూర్య పట్టింది ఒక క్యాచ్ నే మాత్రమే కాదు ఏకంగా వరల్డ్ కప్ నే ఒడిసి పట్టాడు. అది మ్యాచులను మలుపు తిప్పే క్యాచులకుండే విలువ