SL vs NZ Rest day Test | లంక, కివీస్ జట్ల మధ్య ఆరు రోజుల టెస్టు సమరం | ABP Desam
జనరల్ గా ఈ రోజుల్లో టెస్ట్ మ్యాచ్ లంటేనే క్రేజ్ తగ్గిపోతోందని క్రికెట్ బోర్డులు అని తలపట్టుకుంటున్నాయి. దానికి రీజన్ టెస్ట్ మ్యాచ్ లో ఫలితంగా ఐదు రోజులకు తేలటమే. ఐదు రోజుల పాటు మ్యాచ్ కి స్టేడియానికి ప్రేక్షకులను రప్పించటం అనేది తలకు మించిన సవాల్ గా మారిపోయింది క్రికెట్ బోర్డులకు. ఇలాంటి టైమ్ లో న్యూజిలాండ్, శ్రీలంక జట్ల మధ్య ఆరు రోజుల టెస్ట్ మ్యాచ్ జరగనుంది. అదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సెప్టెంబర్ 18 నుంచి గాలే మైదానంలో ప్రారంభం కానున్న మొదటి టెస్ట్ 23వరకూ నిర్వహించనున్నారు. అంటే ఆరు రోజులు. దీనికి రీజన్ ఏంటంటే రెస్ట్ డే. అంటే ఐదురోజుల టెస్ట్ మ్యాచ్ లో ఓ సెలవురోజును యాడ్ చేయటం అన్నమాట. ఎందుకు అంటే శ్రీలంకలో సెప్టెంబర్ 21న అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. అందుకోసం ఆ ఒక్క రోజు ఆటను ఆపుతారు. ఫలితంగా ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్ కాస్త ఆరు రోజులకు పొడిగించినట్లైంది. చివరగా ఇలా ఆరు రోజుల టెస్ట్ మ్యాచ్ 2008లో జరిగింది. అప్పుడు బంగ్లా దేశ్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ ను ఇలాగే ఎన్నికల కోసం ఓ సెలవు ఇచ్చి ఆరు రోజులు పొడిగించారు. ఇప్పుడంటే ఇది వింతలా ఉంది కానీ గతంలో టెస్టు మ్యాచులన్నీ ఇలా రెస్ట్ డే తో కలిపి ఆరు రోజులు పాటే జరిగేవి. 2001లో జింబాబ్వే సిరీస్ తో ఆరు రోజుల టెస్టు మ్యాచులను పూర్తిగా నిలిపివేసి వాటిని ఐదురోజులకు కుదించారు.