Sanju Samson Century in KCL | సెంచరీతో అదరగొట్టిన సంజూ శాంసన్ | ABP Desam
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ కోసం అందరు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అయితే బీసీసీఐ ప్రకటించిన టీమ్ పై ఎన్ని సందేహాలు ఉన్నాయి, చర్చలు కూడా గట్టిగానే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఆసియా కప్‌లో టీమిండియా బ్యాటింగ్ లైనప్ ఎలా ఉండబోతుందనేది చర్చగా మారింది. ముఖ్యంగా వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, సంజూ శాంసన్ మధ్య పోటీ నెలకొంది.
ఓపెనర్ గా సంజు శాంసన్ స్థానంలో గిల్ ఆడే ఛాన్స్ ఉందంటూ మొదలైన ప్రశ్నకు శాంసన్ తన స్టైల్ లో సమాధానం ఇచ్చాడు. కేరళ క్రికెట్ లీగ్‌లో తన బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. సెంచరీతోనే ఆసియా కప్ లో తన స్థానాన్ని ఎవరు తీసుకోలేరంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు అని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్.
కొచ్చి బ్లూ టైగర్స్ తరపున ఆడుతున్న శాంసన్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. 16 బంతుల్లోనే ఆఫ్ సెంచరీ చేసి.. 42 బంతుల్లోనే 13ఫోర్లు, ఐదు సిక్సులతో సెంచరీ చేశాడు. 51 బంతుల్లో 121 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో సెలక్టర్ల దృష్టిని మరోసారి తనవైపు తిప్పుకున్నాడు సంజూ.
ఆసియా కప్ లో టీం ఇండియాలో ఓపెనర్ గా అభిషేక్ శర్మ, శాంసన్, గిల్ మధ్య పోటీ ఉంది. చీఫ్ సెలెక్టర్ అగార్కర్ కూడా ఈ ముగ్గురిలో నుంచే ఎవరో ఒకరిని ఎంపిక చేసే అవకాశం ఉంది. మరి సంజు గేమ్ తో సెలెక్టర్స్ ను ఆకట్టుకుంటాడా.. లేదా వైస్ కెప్టెన్ గిల్ గెలుస్తాడా అన్నది వేచి చూడాల్సిందే.





















