Rohit Sharma Virat Kohli Failures | హిట్ మ్యాను, కింగు ఇద్దరూ ఆడకపోతే ఎవరిని అని ఏం లాభం | ABP Desam
రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ. మోడ్రన్ డే క్రికెట్ లో లెజెండ్స్. రీసెంట్ గా టీ20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు వాళ్ల సంబరాలు చూశాం. ఇద్దరికీ దక్కి తీరాల్సిన గౌరవం అది. ఆ తర్వాత ఇద్దరూ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించేసి కొత్త కుర్రాళ్లకు అవకాశాలు ఇచ్చారు. ఇప్పుడు టెస్టు క్రికెట్ లో కూడా వీళ్ల ఆటతీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ వైట్ వాష్ అయిన తర్వాత రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు. కెప్టెన్ గా, బ్యాటర్ గా తన కెరీర్ లో ఇప్పుడు బెస్ట్ ఫామ్ లో లేనని ఒప్పుకున్నాడు. కెప్టెన్ గా రోహిత్ శర్మ కెరీర్ లో ఈ వైట్ వాష్ మాయని మచ్చ. ఇక్కడ దోషి రోహిత్ శర్మ ఒక్కడే కాదు కింగ్ విరాట్ కొహ్లీ కూడా. పరుగుల యంత్రంలా ప్రత్యర్థులను జీవితంలో మర్చిపోలేని విధంగా కసితీరా కొట్టిన విరాట్ కొహ్లీ తన ప్రైమ్ ను దాటేశాడనేది జీర్ణించుకోలేకపోయినా వాస్తవం. న్యూజిలాండ్ తో సిరీస్ కి ముందు బంగ్లా దేశ్ తో టెస్ట్ సిరీస్ లోనూ రోహిత్, కొహ్లీ ఉమ్మడిగా ఫెయిల్ అయ్యారు. ఈ లిస్ట్ చూడండి ఇది కొహ్లీ గత పది టెస్టుల ప్రదర్శన. ఎప్పుడో సౌతాఫ్రికా సిరీస్ లో ఓ 70పరుగులు, న్యూజిలాండ్ మొదటి టెస్టు లో 70 మినహా మిగిలినదంతా పూర్ ఫర్ ఫార్మెన్స్. రోహిత్ శర్మ కూడా అంతే బంగ్లాదేశ్, న్యూజిలాండ్ సిరీసుల్లో ఒక్కసారి మాత్రమే 70 కొట్టాడు. ఇలా టీమిండియాను ముందుండి నడిపించాల్సిన ఈ సీనియర్లు ఇద్దరూ కలెక్టివ్ గా ఫెయిల్ అవ్వటం టీమిండియాను విపరీతంగా బాధిస్తోంది. భారత్ టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద ఓటమిగా నిలిచిన న్యూజిలాండ్ సిరీస్ ఓటమి నుంచి బయటపడి ఆస్ట్రేలియాతో బీజీటీ సిరీస్ లోనైనా ఈ ఇద్దరూ విజృంభించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. లేదంటే టీ20ల్లానే టెస్టులు కూడా వదిలేయటం బెటర్. కుర్రాళ్లు అయినా ఆడుకుంటారనేది జెన్యూన్ ఫీలింగ్. నో హేట్రెడ్.