Shoaib Akhtar Comments: పాకిస్థాన్‌లో ఆడాలా వద్దా అనే నిర్ణయం బీసీసీఐది కాదు బీజేపీ గవర్నమెంట్‌ది- అక్తర్ హాట్ కామెంట్స్
Shoaib Akhtar Comments On Champions Trophy:పాకిస్తాన్‌లో ఛాంపియన్ ట్రోఫీలో ఆడేందుకు భారత్ వస్తుందని అశాభావం వ్యక్తం చేశారు మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్. బీజేపీ ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలన్నారు.
Shoaib Akhtar made a big statement on India: టీమ్ ఇండియా పాకిస్థాన్ పర్యటనకు వెళ్లాలా వద్దా అనేది నిర్ణయించేది బీసీసీఐ కాదని బీజేపీ ప్రభుత్వమని విమర్శలు చేశారు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్.
ఛాంపియన్స్ ట్రోఫీ-2025కి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తోంది. ఈ టోర్నీకి వెళ్లి ఆడేందుకు టీమిండియా అంగీకరించడం లేదు. దీన్ని తటస్త వేదికపై నిర్వహించాలని బీసీసీఐ డిమాండ్ చేస్తోంది. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై నీలినీడలు అలుముకున్నాయి. 2023లో జరిగిన ఆసియా కప్‌లా దీన్ని కూడా హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలని కూడా చూస్తున్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీ వివాదంపై ఇంకా చర్చలు సాగుతున్న టైంలో పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు దిగుతోంది. మాజీ క్రికెటర్లు కూడా నోరు పారేసుకుంటున్నారు. అదే బాటలో పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీమ్ ఇండియా పాకిస్థాన్ పర్యటన బీజేపీ ప్రభుత్వంపైనే ఆధారపడి ఉంటుందని, బీసీసీఐపై కాదని విమర్శలు గుప్పించారు.
ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షోయబ్ అక్తర్ మాట్లాడుతూ.. ‘‘అది ప్రభుత్వానికి సంబంధించింది. బీసీసీఐకి ఎలాంటి సంబంధం లేదు. ఆ నిర్ణయం బీజేపీ ప్రభుత్వానిదే. వారే నిర్ణయిస్తారు. తెరవెనుక చర్చలు జరుగుతున్నప్పుడు, మనం ఆశ కోల్పోకూడదు, 95-98 శాతం స్పాన్సర్‌షిప్ వస్తుంది. అని అన్నారు.
"భారత్‌ను పాకిస్తాన్‌కు రప్పించలేకపోతే రెండు విషయాలు జరుగుతాయి. మనం ఆతిథ్య దేశానికి వచ్చే 100 మిలియన్ల డాలర్ల స్పాన్సర్‌షిప్‌ను కోల్పోతాము. రెండోది ఆ డబ్బులు హోస్ట్ చేసే దేశానికి వెళ్తాయి. భారతదేశం ఇక్కడకు వచ్చి ఆడితే మంచిదే, కానీ ఇది పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించినది. దీనికి బీసీసీఐతో సంబంధం లేదు." అని అన్నారు.
ఓ పెద్ద టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇవ్వలేని విధంగా పాకిస్థాన్ ఇమేజ్ ఉందని అక్తర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ వంటి పెద్ద టోర్నీలకు ఆతిథ్యం ఇవ్వలేమనే ట్యాగ్ పాకిస్థాన్‌కు ఉంది. కానీ ఆశగా ఎదురుచూద్దాం.. చివరి క్షణం వరకు వేచిచూద్దాం.. ప్రస్తుతం నన్ను అడిగితే భారత్ వస్తోందని చెబుతా’’ అని అక్తర్ అన్నారు. ఇంకా ఏదీ అధికారిక ప్రకటన రాలేదు. మరి టీమిండియా పాకిస్థాన్‌కు వెళ్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. షెడ్యూల్ విడుదలైన తర్వాతే ఓ నిర్ణయం వెలువడే ఛాన్స్ ఉంది.
Also Read: రిషభ్ పంత్ కోసం విపరీతమైన పోటీ, కొత్త రికార్డులు సెట్ చేస్తాడా ? ధర గెస్ చేశారా!