Gautam Gambhir Australia Press meet | BGT 2024 కోసం కసిగా ఎదురుచూస్తున్నామన్న గౌతం గంభీర్ |ABP Desam
న్యూజిలాండ్ తో స్వదేశంలో టెస్ట్ సిరీస్ ఓడిపోయిన అనుభవంతో ఆస్ట్రేలియా సిరీస్ కు వెళ్తోంది టీమిండియా. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నవంబర్ 22 నుంచి ఐదు టెస్టులు ఆస్ట్రేలియాలో ఆడనుంది భారత్. రోహిత్ శర్మ మినహా మిగిలిన టీమ్ తో కలిసి ఈ రోజు ఆస్ట్రేలియాకు బయల్దేరే ముందు ముంబైలో మీడియాతో మాట్లాడాడు గంభీర్. ప్రధానంగా విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ దారుణమైన ఫామ్ పై కామెంట్స్ చేస్తున్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పై మండిపడ్డాడు గంభీర్. రికీ పాంటింగ్ కు అసలు ఇండియన్ క్రికెటర్స్ వాళ్ల ఆటతీరుతో సంబంధం ఏంటన్న గంభీర్..అతను తన పని చూసుకోవాలని లేదంటే ఆస్ట్రేలియా క్రికెట్ సంగతి చూసుకోవాలని సలహా ఇచ్చాడు. అంతే కానీ టీమిండియా వ్యవహారాల్లో తలదూర్చటం సరికాదంటూ స్ట్రాంగ్ కౌంటర్సే ఇచ్చాడు. రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ ఎలాంటి ఆటగాళ్లో ప్రపంచం మొత్తం చూశారని..అలాంటి వాళ్లు ఒకటి రెండు సిరీస్ లు ఫెయిల్ అయినంత మాత్రాన వాళ్లపై ఇష్టానుసారం మాట్లాడటం సరికాదు అన్నాడు. వచ్చే ఆస్ట్రేలియా సిరీస్ వాళ్లకు చాలా ఇంపార్టెంట్ అని ఫీలవుతున్నారని..డ్రెస్సింగ్ రూం మొత్తం ఆకలితో ఉందని..కచ్చితంగా వందశాతం కసితో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడుతారని తన ప్లేయర్లను వెనుకేసుకు వచ్చాడు గంభీర్.