ట్రోఫీ మ్యాచ్‌లపై ఐసీసీకి లెటర్ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్
పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ఐసీసీకి ఓ లెటర్ రాసింది. మా దేశంలో ఛాంపియన్స్ ట్రోఫీ ఆడడానికి సమస్యేంటో చెప్పాలని అందులో రిక్వెస్ట్ చేసింది. ఎందుకు పాకిస్థాన్‌కి రావడం లేదో BCCI నుంచి ఓ అఫీషియల్‌గా ఓ లెటర్ కావాలని అడిగింది. ఈ టోర్నమెంట్ ఆడేందుకు భారత ప్రభుత్వం బీసీసీఐకి అనుమతినివ్వడం లేదని అసహనం వ్యక్తం చేసింది. ఇప్పటికే ఈ వ్యవహారంలో పెద్ద రచ్చే జరుగుతోంది. ట్రోఫీకి 100 డేస్ కౌంట్‌డౌన్ ఉందనగా...లాహోర్‌లో ప్రీ టోర్నమెంట్ ఈవెంట్‌కి ప్లాన్ చేశారు. కానీ..అది కూడా పోస్ట్‌పోన్ అయింది. టీమిండియా ఆటగాళ్లు పాక్‌కి వెళ్లేందుకు ఆసక్తి చూపించకపోవడం వల్ల మొత్తానికి ఈ ఈవెంట్‌ని రద్దు చేయాల్సి వచ్చింది. అసలు ఈ ఈవెంట్ పెడతారా లేదా అన్నదీ డౌట్‌గానే ఉంది. అయితే..పాకిస్థాన్ మాత్రం ఈ విషయంలో రాజీ పడడం లేదు. టోర్నమెంట్ మొత్తం పాక్‌లో జరుగుతుందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ తేల్చి చెబుతోంది. బీసీసీఐ మాత్రం యూఏఈ లేదా యూకేలో నిర్వహించేలా హైబ్రిడ్ మోడల్ ఫాలో అయితే బెటర్ అని సూచిస్తోంది. 2023 ఏషియా కప్ టైమ్‌లో ఇదే మోడల్‌ని ఫాలో అయ్యారు.