Rohit Sharma Undergo Bronco Test | హిట్ మ్యాన్ ను క్రికెట్ కు దూరం చేసేలా బీసీసీఐ | ABP Desam
ఎట్టి పరిస్థితుల్లోనూ హిట్ మ్యాన్ రోహిత్ శర్మను క్రికెట్ కు దూరం చేయాలనే ఆలోచనతో ఉన్నారేమో బీసీసీఐ అండ్ హెచ్ కోచ్ గౌతం గంభీర్..అత్యంత కఠినమైన ఫిట్ నెస్ పరీక్షకు వచ్చి ప్రూవ్ చేసుకోవాలని వన్డే కెప్టెన్ రోహిత్ శర్మకు పిలుపు పంపించారు. బెంగుళూరులోని బీసీసీఐ ఆధ్వర్యంలో పనిచేసే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కు వచ్చే నెల 13న బ్రాంకో పరీక్షలకు హాజరుకావాలని రోహిత్ శర్మకు ఆదేశాలు అందాయి. ఆస్ట్రేలియా తో వన్డే సిరీస్ లో పాల్గొనాలంటే ఈ బ్రాంకో పరీక్షల్లో పాల్గొనటం పాస్ కావటం తప్పనిసరి. గతంలో యోయో టెస్టుల పేరుతో ఆటగాళ్ల ఫిట్ నెస్ ను పరీక్షించిన బీసీసీఐ ఇప్పుడు దాని స్థానంలో ఇంకా కఠినమైన బ్రాంకో టెస్ట్ ను తీసుకువచ్చింది. 20,50,60 మీటర్ల పరుగు పందెం అంటూ ఐదు సెట్ల పాటు ఆపకుండా పరిగెత్తుతూ ఎంత టైమ్ లో ఈ ఛాలెంజ్ ను ఆటగాడు పూర్తి చేస్తున్నాడో రికార్డు చేస్తారు బ్రాంకో టెస్టులో. 38ఏళ్ల రోహిత్ శర్మ ఈ పరీక్షను విజయవంతంగా పూర్తి చేయటం దాదాపుగా కష్టమని అంటున్నారు. అంటే ఓ రకంగా ఈ సాకు చూపించి హిట్ మ్యాన్ ను క్రికెట్ దూరం చేసే ప్లాన్ చేస్తున్నారని..ఇన్నాళ్లూ దేశానికి సేవలందించిన ఆటగాళ్లను గౌరవప్రదంగా పంపించాలి కానీ ఇలా వయస్సుకు మించిన భారాన్ని వాళ్లపై మోపి కాదని రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.





















