Rishabh Pant Scammed by Cunning Fan | చదువుకుంటానని అబద్ధాలు చెప్పి..అడ్డంగా బుక్ చేశాడు | ABP Desam
ఓ కాలేజీ కుర్రాడు ట్విట్టర్ లో క్రికెటర్ రిషభ్ పంత్ ను ట్యాగ్ చేసి ఓ ట్వీట్ పెట్టాడు. నా పేరు కార్తీకే మౌర్య. ఛండీగఢ్ యూనివర్సిటీలో చందువుకుంటున్నారు. పార్ట్ టైమ్ జాబ్ కూడా చేస్తున్నా ఇల్లు గడవటం కష్టంగా ఉంది. కాలేజీ ఫీజు కట్టుకోలేకపోతున్నాను. దాదాపు తొమ్మిదిలక్షల రూపాయల కాలేజీ ఫీజు పెండింగ్ ఉండిపోయింది మీరు ఆదుకుంటే చదువుకుంటాను అని పంత్ ను ట్యాగ్ చేసి ట్వీట్ పెట్టాడు. దీనికి రిషభ్ పంత్ కూడా స్పందించాడు. కీప్ ఛేజింగ్ యువర్ డ్రీమ్స్. గాడ్ హేజ్ బెటర్ ప్లాన్స్ ఆల్వేస్ టేక్ కేర్ అని రిప్లై ఇచ్చాడు. అంతే చాలా మంది అసలు ఎవరీ మౌర్య. పంత్ ఎంత హెల్ప్ చేసి ఉంటాడని అతని గురించి మొత్తం వెతకటం మొదలుపెట్టారు. దాంతో అసలు విషయం బయటపడింది. ట్రూ ఇండియా సీన్స్ అనే ట్విట్టర్ ఐడీతో అతను ఇలాగే కథలు చెప్తూ అందర్నీ మోసం చేస్తుంటాడు. గతంలో ఆర్సీబీ మీద బెట్ వేసి 90వేలు నష్టపోయాను హెల్ప్ చేయండి అని స్కానర్ కోడ్ ను ట్విట్టర్ లో పెట్టాడు. అంతకు ముందు కరోనా టైమ్ లో నష్టపోయాను హెల్ప్ చేయండి అని సోనూసూద్ ను ట్యాగ్ చేసి పోస్టులు పెట్టేవాడు. ఇప్పుడు ఆ ఫ్రాడ్ పోస్ట్ కే రిషభ్ పంత్ దొరికిపోయాడు. పంత్ మరి డబ్బులు పంపించాడో లేదో తెలియదు కానీ ట్విట్టర్ లో పంత్ ను ట్యాగ్ చేసి ఇలా మోసపోయావ్ ఏంటీ భయ్యా వాడో ఫ్రాడ్ అంటూ ట్వీట్లు మీద ట్వీట్లు పెట్టాడు. దీంతో దొరికిపోయిన ఆ కుర్రాడు తన ట్విట్టర్ ఖాతాను ట్వీట్ ను డిలీట్ చేసుకుని వెళ్లిపోయాడు. మరి పంత్ డబ్బులు వేయలేదో లేదా వేసి మోసపోయాడో తెలియదు కానీ అయ్యో పాపం స్పైడీ మంచి చేయబోతే చెడు ఎదురైంది అందరూ పంత్ మీద జాలి చూపిస్తున్నారు.