Prince Frederick Louis The Cricket Tragedy | క్రికెట్ కోసం కిరీటాన్ని వదులుకున్న ఇంగ్లీష్ రాజు | ABP Desam
సూర్యుడు అస్తమించని సామ్రాజ్యాన్ని పాలించే అవకాశాన్ని కేవలం క్రికెట్ కోసం వదులుకున్న ఓ యువరాజు ఉన్నాడంటే నమ్ముతారా.? కానీ ఇది నిజం.. ఇంగ్లండ్‌కి చెందిన ఫ్రెడరిక్ లూయిస్ అనే యువరాజు మాత్రం అదే చేశాడు. క్రికెట్ కోసం తన తండ్రిని, రాజ్యాన్ని, రాజయ్యే అవకాశాన్ని, చివరికి తన ప్రాణాన్ని కూడా వదిలేశాడు.
హాయ్.. అండ్ వెల్‌కమ్ టూ స్పోర్ట్స్ టేల్స్. క్రికెట్ అంటే మన ఇండియన్స్‌కి జస్ట్ ఓ గేమ్ కాదు.. అదో ఎమోషన్. చిన్న పిల్లల నుంచి పండు ముసలోళ్ల దాక క్రికెట్ అంటే ఓ ఇన్స్‌పిరేషన్. కానీ అది ఇప్పుడు. ఒకప్పుడు క్రికెట్ అంటే మనకి అసలు తెలియను కూడా తెలీదు. ఆ టైంలో కేవలం క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లండ్‌లో మాత్రమే.. ఈ ఆట తెలుసు. అయితే అక్కడ చాలామంది దీన్ని పెద్దగా పట్టించుకునే వాళ్లు కాదు. కానీ ఫ్రెడెరిక్ మాత్రం.. ఆ ఆటపై అంతులేని ఇష్టాన్ని పెంచుకుని.. దానికే తన జీవితాన్ని అంకింతం చేసి.. ఆ ఆటలోనే చివరికి ప్రాణాలు కూడా పోగొట్టుకున్నాడు.
1707వ సంవత్సరంలో జర్మనీలోని హనోవర్‌లో జన్మించాడు ఫ్రెడరిక్. ఆయన తండ్రి జార్జ్ 2 అప్పటికే బ్రిటన్ చక్రవర్తిగా ఉన్నాడు. అయితే 21 ఏళ్ల వయసొచ్చేదాక జర్మనీలోనే ఉన్న ఫ్రెడరిక్ ఆ తర్వాత తండ్రి దగ్గరకెళ్లాడు. కానీ అక్కడ తండ్రితో, బంధువులతో విబేధాలొచ్చాయి. ఒకపక్క చుట్టూ తనకి ఏ మాత్రం తెలియని ఇంగ్లీష్ సొసైటీ.. ఇంకోపక్క కుటుంబ సభ్యులతోనే విభేధాలు. అన్నీ కలిసి మానసికంగా చాలా ఇబ్బంది పడ్డాడు. అలాంటి టైంలో ఫ్రెడరిక్‌కి క్రికెట్ తన బాధలన్నింటికీ ఓ గొప్ప మందులా దొరికింది. అప్పట్లో కేవలం పల్లెటూళ్లలో మాత్రమే ఆడే క్రికెట్‌ని తన కొడుకు ఆడుతున్నాడని తెలిసి.. కింగ్ జార్జ్ 2 చాలా కోప్పడ్డాడు. ‘ఇలాంటి ఆటలు ఆడితే రాజ కీరీటం నీకు దక్కద’ని వార్నింగ్ ఇచ్చాడు. కానీ ఫ్రెడెరిక్ మాత్రం వెనక్కి తగ్గలేదు. క్రికెట్‌నే తన జీవితం చేసుకున్నాడు. కిరీటాన్ని వద్దనుకుని క్రికెట్ బ్యాట్ పట్టాడు.
మొదట్లో ఫ్రెడరిక్ జస్ట్ క్రికెట్‌ని చూసేవాడు మాత్రమే. ఆ తర్వాత నెమ్మదిగా ఆడటం స్టార్ట్ చేశాడు. తాను రాజకుటుంబం నుంచి వచ్చినా సాధారణ ప్రజలతో ఎంతో కలిసిపోయేవాడు. 1731లో కెన్నింగ్టన్ కామన్‌లో సర్రై క్రికెట్ క్లబ్, లండన్ క్రికెట్ క్లబ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఫ్రెడరిక్ ఫస్ట్ టైం గ్రౌండ్‌లో అడుగుపెట్టాడు. అయితే ఆ మ్యాచ్‌లో ఆయన సాధించిన రికార్డులకి సంబంధించిన డేటా లేకపోయినా.. ఒక యువరాజు క్రికెట్ ఆడటం మాత్రం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. 1733 నాటికి ఆయన పూర్తి క్రికెట్ ఫ్యాన్‌గా మారిపోయాడు. అక్కడితో ఆగకుండా.. 'ప్రిన్స్ ఆఫ్ వేల్స్ లెవెన్’ పేరుతో సొంత జట్టును ఏర్పాటు చేసుకున్నాడు. మ్యాచ్‌లలో గెలిచిన వాళ్లకి తన సొంత డబ్బుతో బహుమతులిచ్చేవాడు. అలా క్రికెట్ చరిత్రలో తొలిసారిగా ఒక టోర్నమెంట్‌లో ట్రోఫీని బహుమతిగా ఇచ్చింది వ్యక్తిగా కూడా చరిత్రకెక్కాడు ఫ్రెడరిక్.





















