KL Rahul To Quit LSG Captaincy | లక్నో కెప్టెన్సీ నాకు వద్దంటున్న కేఎల్ రాహుల్ | ABP Desam
ఐపీఎల్ 2025కి ముందు LSG ఫ్రాంచైజీకి షాక్. ఆ టీమ్ ను నడిపిస్తున్న కెప్టెన్ కేఎల్ రాహుల్ వచ్చే ఐపీఎల్ కి కెప్టెన్సీ చేయనని చెప్పేశాడట. నిన్న కోల్ కతా కు వెళ్లిన రాహుల్ అక్కడ తమ టీమ్ ఓనర్ సంజీవ్ గోయెంకాను మీట్ అయ్యారు. దాదాపుగా 4గంటల పాటు కేఎల్ తో సంజీవ్ గోయెంకా చర్చలు జరిగాయి. దీంట్లో తను వచ్చే ఐపీఎల్ కి ఎల్ఎస్జీ కెప్టెన్సీ చేయట్లేదని చెప్పేసినట్లు విశ్వసనీయ సమాచారం. కెప్టెన్సీ వదన్నుకున్నాడంటే టీమ్ లోనైనా కొనసాగుతాడా లేదా మెగా ఆక్షన్ లో నిలబడతాడా అనేది ఇంకా స్పష్టత రాలేదు. ఒకవేళ రాహుల్ లక్నోను వదిలేయాలి అనుకుంటే అతన్ని కావాలని అనుకునేందుకు ప్రస్తుతానికి మూడు టీమ్స్ సిద్ధంగా కనిపిస్తున్నాయి. మొదటిది పంజాబ్ కింగ్స్. శామ్ కరన్ లేదా శిఖర్ ధవన్ తో ప్రయోగాలు చేస్తున్న పంజాబ్ రాహుల్ అయితే తమ టీమ్ ను సమర్థంగా నడిపిస్తాడని భావిస్తోందట. రెండో టీమ్ బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ గతంలో మూడేళ్లపాటు ఆర్సీబీకి ఆడిన రాహుల్ అప్పట్లో బ్యాటర్ గా అద్భుతంగా రాణించాడు. ఇప్పుడు వచ్చే ఐపీఎల్ కి ఫాఫ్ డుప్లెసిస్ అందుబాటులో ఉండే అవకాశాలు కనిపించటం లేదు. అందుకని కేఎల్ ను కొహ్లీ వారసుడిగా తీసుకోవాలని ఆర్సీబీ మేనేజ్మెంట్ కూడా ప్లాన్స్ వేస్తోందని టాక్. ఇక మూడో టీమ్ ఢిల్లీ. ఢిల్లీ క్యాపిటల్స్ కి కెప్టెన్ గా రిషభ్ పంత్ వచ్చే ఐపీఎలో జట్టు మారాలని ప్రయత్నిస్తున్నాడు. అతడి కోసం చెన్నై సూపర్ కింగ్స్ ప్లాన్ చేస్తోందని ప్రచారం జోరుగా జరుగుతోంది. సో పంత్ ఢిల్లీని కాదనుకుంటే కేఎల్ రాహుల్ ని నాయకుడిగా పాడుకునే అవకాశం ఉంది. చూడాలి లాస్ట్ ఐపీఎల్ లో మ్యాచ్ లు ఓడిపోయాడని సంజీవ్ గోయెంకా అందరి ముందు తిట్టిన తిట్లు రాహుల్ ని బాగానే హర్ట్ చేసినట్లు అర్థం అవుతోంది. అప్పుడంతా సర్దుమణిగినట్లు హగ్గింగ్ లు ఇచ్చుకున్నా టీమ్ మారిపోతున్నాడు అంటే రాహుల్ భయ్యా కో గుస్సా ఆగయా అనే మాట్లాడుకుంటున్నారు అంతా.