IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
సాధారణంగా ఐపీఎల్ సీజన్ ఓపెనింగ్ సెర్మనీకి ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఏటా ఓపెనింగ్ మ్యాచ్ ఎక్కడ నిర్వహించినా దానికి ముందు స్టార్ సింగర్స్, బాలీవుడ్ యాక్టర్స్, ర్యాపర్స్ కాన్సెర్ట్ లతో ఓపెనింగ్ సెర్మనీ ఓ రేంజ్ లో నిర్వహించటం బీసీసీఐకి అలవాటు. అలా ఈసారి ఐపీఎల్ సీజన్ 19 ఇవాళ రాత్రికి ఆర్సీబీ, సన్ రైజర్స్ జట్ల మధ్య బెంగుళూరు చిన్న స్వామి స్టేడియంలో ప్రారంభం కానుంది. కానీ ఈ సారి మాత్రం ఎలాంటి ఓపెనింగ్ సెర్మనీని చిన్న స్వామిలో నిర్వహించట్లేదు. రీజన్ లాస్ట్ సీజన్ లో ఐపీఎల్ ట్రోఫీని మొదటి సారి సాధించిన ఆర్సీబీ జట్టు నిర్వహించిన విక్టరీ పరేడ్ లో భారీ తొక్కిసలాట జరిగి 11మంది క్రికెట్ అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. ఐపీఎల్ చరిత్రలోనే మాయని మచ్చలా మిగిలిపోయిన ఈ విషాదానికి సంతాపంగా ఈ సీజన్ లో ఓపెనింగ్ సెర్మనీని నిర్వహించకూడదని ఐపీఎల్ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంది. అంతే కాదు చిన్న స్వామి స్టేడియంలో 11 కుర్చీలతో ప్రత్యేకమైన గ్యాలరీ ఏర్పాటు చేసి చిన్న స్వామి స్టేడియంలో ఎప్పటికీ ఆ గ్యాలరీని ఓ మెమరీలా ఆ సీట్లను విక్రయించుకుండా వదిలిపెట్టేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. సో ఆ గ్యాలరీని కూడా ఇవాళ ప్రారంభించనున్నారు. పొలిటీషయన్ల హడావిడి కారణంగా సాధారణ ఫ్యాన్స్ ఇబ్బంది పడకుండా ప్రజాప్రతినిధుల కోసం సపరేట్ గా వేరే గ్యాలరీని ఏర్పాటు చేశారు. సో ఇలా గత సీజన్ విషాదకర ఘటనలను గుర్తు చేసుకుంటూ క్రికెట్ కోసం ప్రాణాలు వదిలేసిన 11 మంది అభిమానులకు సంతాపాన్ని ప్రకటించగా నిరాడంబరంగా ఐపీఎల్ సీజన్ ను ప్రారంభించనున్నారు.























