Dressing Room Tales| #EP5: వారి ముగ్గురి కాలంలో ఆడటమే అమోల్ కు శాపమా..? కాదనలేం ఏమో..!
ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్లండి. ఏ క్రికెట్ జట్టునైనా ఉదాహరణకు తీసుకోండి. మీకు 3 రకాల ప్లేయర్స్ కనిపిస్తారు. నంబర్ వన్. డొమెస్టిక్ క్రికెట్ లో అదరగొట్టి, అంతర్జాతీయంగా అంతగా ఆకట్టుకోని వాళ్లు. నంబర్ టు. డొమెస్టిక్ క్రికెట్ లో అంతంతమాత్రంగా ఆడినా, లక్ తో జాతీయ జట్టులోకి వచ్చి అదరగొట్టినవాళ్లు. నంబర్ 3. డొమెస్టిక్ క్రికెట్ లో రికార్డుల మోత మోగించినా... నన్ను టీంలోకి తీసుకోండంటూ సెలెక్టర్ల తలుపులు బద్దలుకొట్టినా.... ఒక్కసారి కూడా అంతర్జాతీయ మ్యాచ్ ఆడనివాళ్లు. ఇవాళ మన డ్రెస్సింగ్ రూం టేల్స్ ఐదో ఎపిసోడ్ లో చెప్పుకోబోయేది.....ఈ మూడో రకం క్రికెటర్ గురించే. అతని పేరు. అమోల్ మజుందార్. అతని కెరీర్ లో ఏం జరిగింది..? రంజీలో పరుగుల వరద పారించినా.... ఒక్క అంతర్జాతీయ మ్యాచూ ఎందుకు ఆడలేకపోయాడు..? ఈ ఎపిసోడ్ లో చెప్పుకుందాం.





















