Aiden Markram 136 Runs WTC 2025 Final | ఆస్ట్రేలియా పేస్ త్రయాన్ని గడగడలాడించిన మార్ క్రమ్ | ABP Desam
చాలా మంది బ్రెట్ లీ, మెక్ గ్రాత్ ల గెలెస్పీల గురించి మాట్లాడతారు కానీ ఈ తరానికి పేస్ త్రయం అంటే మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, జోష్ హేజిల్ వుడ్. మాములుగా మనకు బాగా పరిచయమైన ఐపీఎల్లో వీళ్ల ముగ్గురు వేర్వేరు టీమ్స్ లో ఉంటేనే ప్రత్యర్థులు వణికిపోతారు. అలాంటిది ఆస్ట్రేలియాకు వీళ్ల ముగ్గురు కలిసి కొన్నేళ్లుగా మర్చిపోలేని విజయాలు అందిస్తున్నారు. ఓ ఐసీసీ ఫైనల్ కి చేరుకున్నాక వీళ్ల ముగ్గురు ఉన్న మ్యాచ్ ఇప్పటి వరకూ ఆస్ట్రేలియా ఓడిపోయిందే లేదు. బంతి కొత్తదైనా పాతదైనా స్వింగ్ బౌలింగ్ తో రచ్చ లేపే ఈ ముగ్గురిని మడతపెట్టి కొట్టాడు మన మలక్ పేట్ మార్ క్రమ్. ఆస్ట్రేలియా విసిరిన 282 పరుగులు రికార్డు లక్ష్యాన్ని లార్డ్స్ లో ఫోర్త్ ఇన్నింగ్స్ లో ఛేజ్ చేయటం అంటే మాములు విషయం కాదు. అలాంటిది ఆ గ్రీన్ పిచ్ మీద పేస్ కు స్వర్గధామమైన చోట స్టార్క్, కమిన్స్, హేజిల్ వుడ్ లను సమర్థంగా ఎదుర్కొంటూ తెంబా బవుమా తో కలిసి అద్భుతమైన పార్టనర్ షిప్ పెట్టాడు మార్ క్రమ్. ఓపిక, సహనానికి కేరాఫ్ అడ్రస్ లా బ్యాటింగ్ చేస్తూ 207 బంతులు ఎదుర్కొని 14 ఫోర్లతో 136 పరుగులు సాధించాడు. విజయానికి 6 పరుగుల ముందు ఔట్ అయిన చివర వరకూ నిలబడలేదన్న కోపంతో క్రీజు వదిలి నిరుత్సాహంగా వెళ్లాడటంతే అర్థం చేసుకోవచ్చు మార్ క్రమ్ ఎంతటి స్ట్రాంగ్ మైండ్ తో రెండు రోజులు బ్యాటింగ్ చేశాడని. సౌతాఫ్రికాకు మాజీ కెప్టెన్ గా, ఉన్న వాళ్లలో సీనియర్ బ్యాటర్ గా...27ఏళ్లుగా ఓ ఐసీసీ టోర్నీ కోసం ఎదురు చూస్తున్న తమ సౌతాఫ్రికా జట్టు కరువు తీరిపోయేలా బవుమా తోడుగా మార్ క్రమ్ ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్ ను...గెలిపించిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ గద ను..ఈ అద్భుతమైన విజయాన్ని సౌతాఫ్రికా క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో భవిష్యత్తు తరాలు చదువుకుంటాయి.



















