Asia Cup 2025 Ind vs Pak Controversy | ఆసియాకప్ కాంట్రవర్సీపై మాజీ క్రికెటర్ ఆవేదన
ఆసియకప్ లో ఎన్నడూ లేని విధంగా వివాదస్పదంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇండియా, పాకిస్తాన్ ప్లేయర్ల ప్రవర్తనతో ఈ సారి ట్రోఫీ హాట్ హాట్ గా మారింది. పెహల్గాం దాడికి నిరసనగా భారత క్రికెటర్లు.. పాక్ క్రికెటర్లతో హ్యాండ్ షేక్ చేసేందుకు నిరాకరించారు. అలాగే ట్రోఫీని కూడా నిరాకరించారు. పాకిస్తాన్ ప్లేయర్స్ కూడా గన్ ఫైరింగ్ సెలబ్రేషన్, ఫ్లైట్ క్రాష్ అంటూ... ఇలా ఎన్నో జరిగాయి. తాజాగా ఇండియా, పాక్ ఆటగాళ్ల తీరుపై 1983 వన్డే ప్రపంచకప్ విన్నింగ్ టీమ్ లో మెంబెర్ మాజీ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణీ ఆవేదన వ్యక్తం చేసారు.
క్రీడల్లో రాజకీయాలు చేయకూడదని కిర్మాణీ ఘాటుగా విమర్శించాడు. తాము ఆడిన కాలంలో ఆటను, రాజకీయాలను వేర్వేరుగా చూసేవాళ్లమని, ఇండియా నుంచి పాక్ కు, పాక్ నుంచి ఇండియాకు ఆటగాళ్లు వచ్చి మ్యాచ్ లు ఆడేవారని అన్నారు. అయితే ప్రస్తుత తరుణంలో అలాంటి పరిస్థితి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆసియాకప్ లో ఆటగాళ్ల ప్రవర్తన చూసి చాలా సిగ్గుగా అనిపించిందని, ఈతరం ఆటగాళ్లకు ఏమైందని కిర్మాణి వ్యాఖ్యానించాడు.





















