Arjun Tendulkar Engagement with Sania Chandok | అర్జున్ టెండూల్కర్ ఎంగేజ్మెంట్
భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఒక ప్రైవేట్ సెరిమొనిలో నిశ్చితార్థం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలు సానియా చందోక్ తో అర్జున్ ఎంగేజ్మెంట్ జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. వీరికి హాస్పిటాలిటీ, ఫుడ్ ఇండస్ట్రీలో సంస్థలు ఉన్నాయి. ప్రముఖ కాంటినేంటల్ హోటల్, బ్రూక్లీన్ క్రీమరీ సంస్థలను కూడా ఈ కుటుంబమే నిర్వహిస్తోంది. సానియాతో అర్జున్ ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ పలువురు కంగ్రాట్స్ చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించి అటు టెండూల్కర్ ఫ్యామిలీ కానీ, ఇటు చందోక్ ఫ్యామిలీ గానీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది.
సచిన్ కొడుకైనప్పటికీ, అర్జున్ కెరీర్ అంతంతమాత్రంగానే ఉంది. ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్ లో అర్జున్ టెండూల్కర్ అరంగేట్రం చేయలేదు. ప్రస్తుతం అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ మెగా టోర్నీలో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్నాడు.





















