Akash Deep Dedicated Wicket Haul to Sister | తన విజయాన్ని సోదరికి అంకితమిచ్చిన ఆకాశ్ దీప్
ఇంగ్లండ్‌పై చారిత్రక విజయం సాధించిన ఈ టైం లో పేసర్ ఆకాశ్ దీప్ స్టోరీ అందరికి కన్నీళ్లు తెప్పిస్తుంది. ఎడ్జ్‌బాస్టన్‌లో తాను సాధించిన ఈ విజయాన్ని క్యాన్సర్ తో పోరాడుతున్న తన సోదరికి అంకితం ఇస్తున్నట్లు ప్రకటించాడు ఆకాష్ దీప్. తాను చెప్పే వరకు కూడా తన సోదరికి క్యాన్సర్ ఉన్నట్టుగా టీంలో ఎవరికీ చెప్పలేదు అని అన్నాడు ఆకాష్ దీప్.
ఈ విషయం నేను ఎవరికీ చెప్పలేదు. మా అక్క గత రెండు నెలలుగా క్యాన్సర్‌తో పోరాడుతోంది. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉంది. నా ప్రదర్శన చూసి అందరికంటే తనే ఎక్కువ సంతోషిస్తుందని అనుకుంటున్నాను. ఈ మ్యాచ్‌ను ఆమెకే అంకితం ఇస్తున్నా. తన ముఖంలో చిరునవ్వు చూడాలనుకుంటున్నాను అని భావోద్వేగానికి లోనయ్యాడు ఆకాష్ దీప్. ఇది నీకోసమే. నేను బాల్ చేతిలోకి తీసుకున్న ప్రతిసారీ నీ ముఖమే గుర్తు వస్తుంది. మేమంతా నీతోనే ఉన్నాం" అని అక్కడున్న వలందరికి కన్నీళ్లు తెప్పించాడు ఈ యువ పేసర్. ఒకవైపు జాతీయ జట్టులో స్థానం దక్కిన ఆనందం, మరోవైపు తన అక్క అనారోగ్యం తనను మానసికంగా కుంగదీశాయని, అయినా ధైర్యంగా నిలబడ్డానని చెప్పాడు ఆకాష్ దీప్.





















