టీమిండియాలో 3 మార్పులు.. రికార్డులు బద్దలవ్వాల్సిందే..!
ఆసియా కప్ 2025 సీజన్లో నేడు పసికూన ఒమన్‌తో తలపడబోతున్న టీమిండియా.. లెక్కలేనన్ని రికార్డులని తిరగరాసేలా కనిపిస్తోంది. ఆల్రెడీ యూఏఈని చిత్తు చేసి, పాకిస్తాన్‌ని మట్టికరిపించి సూపర్4కి అర్హత సాధించిన టీమిండియాకి ఈ మ్యాచ్ ఓ అద్భుతమైన ప్రాక్టీస్ మ్యాచ్‌లా ఉపయోగపడబోతోంది. అందుకే ఈ మ్యాచ్‌లో జట్టులోని కీలక ఆటగాళ్లకి రెస్ట్ ఇవ్వడమే కాకుండా.. రిజర్వ్ బెంచ్ బలాన్ని పరీక్షించాలని టీమిండియా మేనేజ్‌మెంట్, కోచ్ గంభీర్ అనుకుంటున్నారట. అందుకే జట్టులో 3 మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే.. పించ్ హిట్టర్ రింకూ సింగ్‌ని టీమ్‌లోకి తీసుకోబోతున్నారట. అదే జరిగితే ఈ మధ్యనే యూపీ ప్రీమియర్ లీగ్‌లో అదరగొట్టిన రింకూ ఒమన్‌తో మ్యాచ్‌లో కూడా మెరుపులు మెరిపించే ఛాన్స్ ఉంది. ఇక రింకూతో పాటు హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్‌లని కూడా ఫైనల్ లెవెన్‌లో ఛాన్స్ ఇవ్వాలని గంభీర్ భావిస్తున్నాడట. ఒకవేళ వీళ్లిద్దరినీ టీమ్‌లోకి తీసుకుంటే హార్దిక్, బుమ్రాలకి రెస్ట్ ఇచ్చే ఛాన్సుంది. ఇప్పటికే హర్షిత్ రాణా నెట్స్‌లో బ్యాటింగ్, బౌలింగ్ రెండింటినీ ప్రాక్టీస్ చేస్తూ చెమటోడుస్తున్నాడు. రింకూ సింగ్, అర్ష్‌దీప్ సింగ్ కూడా ఫుల్ ఫోకస్డ్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే రింకూని ఫైనల్ 11లోకి సెలక్ట్ చేస్తే.. అతడిని ఎవరి ప్లేస్‌లోకి సెలక్ట్ చేస్తారనేదే ఇప్పుడు టెన్షన్‌గా మారింది. ఆల్ రౌండర్ శివమ్ దూబేని పక్కన పెడతారా..? లేదంటే మిడిలార్డర్ బ్యాటర్ తిలక్ వర్మని కూర్చోబెడారా..? అనేది చూడాలి. ఇదిలా ఉంటే అబుదాబీ స్టేడియంలో టీమిండియాకి సూపర్ రికార్డ్ ఉంది. ఈ పిచ్‌పై టీమిండియా 2021 టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా అఫ్గానిస్తాన్ తో తలపడింది. ఆ మ్యాచ్‌లో ఏకంగా ఆఫ్గాన్ టీమ్‌ని 66 పరుగుల తేడాతో మట్టి కరిపించింది. మరి ఈ సారి ఒమన్‌పై ఇంకెలాంటి అద్భుతమైన విక్టరీ సాధిస్తుందో చూడాలి.





















