Edge Of The Universe Explained : విశ్వానికి ఆది, అంతం తెలుసుకోవటం సాధ్యమేనా..? | ABP Desam
మీకు ఎప్పుడైనా సందేహం వచ్చిందా..మనం నివసిస్తున్న భూమి, మన సౌరకుుటంబం ఇంత పెద్ద విశ్వంలో ఉన్నాయి కదా..మరి ఈ విశ్వానికి ఎండ్ ఎక్కడ అని..? అంటే మన భూమి, మన సౌర కుటుంబం అలా దాటుకుంటూ వెళ్తుంటే అసలు మనం ఎక్కడి వరకూ వెళ్లగలం...ఈ విశ్వానికి ఆ ఎండ్ పాయింట్ లేదా స్టార్టింగ్ పాయింట్ ఏమైనా ఉంది అని. ఇలాంటి సందేహమే ఖగోళ శాస్త్రవేత్తలను వందల సంవత్సరాల పాటు నిద్రపట్టనివ్వకుండా చేసింది. సైన్స్ బాగా డెవలప్ అయిన తర్వాత దీనికి ఆన్సర్ కనుక్కునేందుకు మన సైంటిస్టులు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అందుబాటులో ఉన్న సైన్స్ ఆధారంగా ఈ విశ్వానికి ఎండ్ పాయింట్ లేదా స్టార్టింగ్ పాయింట్ ఏదై ఉంటుదని ఇప్పటివరకూ మన సైంటిస్టులు కనిపెట్టారు. ఈ ఇంట్రెస్టింగ్ పాయింట్ గురించి ఈ వారం అంతరక్ష కథల్లో మాట్లాడుకుందాం.
1. The Pale Blue Dot
ఈ ప్రశ్నకు సమాధానాన్ని అన్వేషించాలంటే మన ప్రయాణాన్ని మన భూమి నుంచి మొదలుపెట్టాలి. ఇదే మన ఫస్ట్ స్టాప్ అనుకుందాం. స్పేస్ సైంటిస్టులు మన భూమిని ముద్దుగా ది పేల్ బ్లూ డాట్ అంటారు. ఇలా ఎందుకు అంటారో ఈ స్టోరీలో కొంచెం ముందుకు వెళ్లాక చెబుతాను. మన భూమి సముద్ర మట్టం నుంచి 100 కిలోమీటర్లు గాల్లోకి వెళ్లిన తర్వాత నుంచి భూమి వాతావరణం దాటి మనం అంతరిక్ష ప్రయాణాన్ని ప్రారంభించినట్లే. చరాచర జీవరాశులు, పర్వతాలు, మహాసముద్రాలు, అన్ని జీవుల కంటే తెలివైన వాళ్లం అనుకునే 800కోట్ల పైబడి ప్రజలు అంతా ఈ భూమి మీదే నివసిస్తున్నారు.





















