China Military Parade | చైనా మిలటరీ పరేడ్‌లో జిన్‌పింగ్‌తో పాటు పుతిన్, కిమ్ | ABP Desam
SCO సమ్మిట్ కోసం చైనా వెళ్లిన ప్రధాని మోదీ అక్కడ చైనా నిర్వహిస్తున్న స్పెషల్ మిలటరీ పరేడ్‌కి మాత్రం అటెండ్ కాకుండా రిటర్న్ వచ్చేశారు. అయితే ఈ పేరేడ్‌కి అటెండ్ కావాలని జిన్‌పింగ్ మోదీకి కూడా ఇన్విటేషన్ పంపించినా కూడా సింపుల్‌గా నో చెప్పి వెనక్కొచేశారు. మోదీ. దీనికి కారణం జపాన్‌తో ఇండియాకున్న రిలేషన్స్‌ని దెబ్బతీసుకోకూడదనే ఉద్దేశమేనని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. నిజానికి ఈ పరేడ్ సెకండ్ వరల్డ్ వార్‌లో జపాన్‌పై చైనా విక్టరీని పురస్కరించుకుని ప్రతి ఏటా నిర్వహిస్తుంది చైనా. అయితే ఈ సారి చాలా తెలివిగా ఎస్‌సీవో సమ్మిట్‌తో పాటే నిర్వహించింది. దీనివల్ల ఈ సమ్మిట్‌కి వచ్చిన కంట్రీస్ అన్నీ ఈ పరేడ్‌కి కూడా అటెండ్ అయ్యేలా ప్లాన్ చేసుకున్నాడు జిన్‌పింగ్. అంతేకాకుండా.. ఈ పరేడ్‌ని జస్ట్ మెమోరియల్ పరేడ్‌లా కాకుండా.. పవర్ షోకేసింగ్ పరేడ్‌లా యూజ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. అందుకే అత్యాధునిక ఆయుధాలని, తన సైనిక సంపదని ప్రదర్శించాడు. అంటే ఓ రకంగా జపాన్‌తో పాటు ప్రపంచ దేశాలకి తన పవర్ ఏంటో చూపించాలనేదే జిన్‌పింగ్ ప్లాన్ అన్నమాట. అందుకే జపాన్‌తో భారత్‌కి ఉన్న గుడ్ రిలేషన్‌ని దృష్టిలో పెట్టుకుని.. ఈ పరేడ్‌కి అటెండ్ కాకుండా మోదీ తిరిగొచ్చేశారు. అయితే మోదీ లేకపోయినా.. రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్, నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ జాంగ్ ఉన్, ఇంకా అనేక దేశాల ప్రెసిడెంట్స్ ఈ పరేడ్‌కి అటెండ్ అయ్యారు. ముఖ్యంగా పుతిన్, కిమ్ ఇద్దరూ జిన్‌పింగ్‌తో కలిసి రెడ్ కార్పెట్‌పై నడుస్తూ ఫోటోలు, వీడియోలకి ఫోజులిచ్చారు. ఇప్పుడీ వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ మిలటరీ పరేడ్ గురించి మాట్లాడుకుంటే.. ఇది బీజింగ్‌లోని టియానన్‌మెన్ గేట్ దగ్గర జరిగింది. ఈ పరేడ్‌లో సీసీపీ మిలటరీ చైనా దగ్గరున్న ఆర్మీ పవర్‌ని, అత్యాధునిక ఆయుధాలని, మిస్సైళ్లు, విమానాలని ప్రదర్శించింది. ఇక ఈ మిలటరీ పరేడ్‌కి అటెండ్ కావద్దంటూ యూరోపియన్ యూనియన్ కంట్రీస్‌ని, అలాగే కొన్ని ఏషియన్ కంట్రీస్‌ని జపాన్ కోరింది. కానీ అందులో చాలా దేశాలు జపాన్ రిక్వెస్ట్‌ని రిజెక్ట్ చేసి ఈ పరేడ్‌కి అటెండ్ అయ్యాయి. ఇండియా మాత్రమే ఆబ్సెంట్ అయింది. దీన్ని బట్టి చూస్తే జిన్‌పింగ్ ప్లాన్ కొంత వరకు సక్సెస్ అయినట్లే కనిపిస్తోంది.





















