Boeing jumbo jet Gift For Trump | షాకైపోయిన ట్రంప్..మొహమాటం లేకుండా అంగీకారం | ABP Desam
సౌదీ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పంట పండింది. రియాద్ ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్ట్ లో దిగేందుకు బయల్దేరిన అమెరికా అధ్యక్షుడి విమానాన్ని ఖతార్ ఫైటర్ జెట్స్ సేఫ్ గార్డ్ చేశాయి. ఫైటర్ జెట్స్ తో వెల్కమ్ చెబుతూ అరేబియన్ కంట్రీస్ చేసిన వెల్కమ్ కి ట్రంప్ మురిసిపోయాడు. సౌదీలోని రియాద్ ఎయిర్ పోర్ట్ లో ట్రంప్ విమానం దిగగానే కాబోయే మహారాజు, ప్రస్తుత యువరాజు అయిన ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ నేరుగా ఎయిర్ పోర్ట్ కి వచ్చి ట్రంప్ ను రిసీవ్ చేసుకున్నారు. రాయల్ ఫ్యామిలీకి చెందిన ఓ వ్యక్తి నేరుగా ఎయిర్ పోర్ట్ కి వచ్చి గెస్ట్ ను రిసీవ్ చేసుకోవటం అరుదు. ఆ తర్వాత అమెరికా, సౌదీ దేశాల మధ్య పలు రంగాల్లో ఒప్పందాలు జరిగాయి. అది కూడా ఎంతకో తెలుసా ఏకంగా 4లక్షల కోట్ల రూపాయలకు రక్షణ, ఆరోగ్యం, వ్యవసాయ రంగాలకు సంబంధించి ఎంఓయూలకు చేసుకున్నారు. ఇదే భారీ విషయం అంటే అంతకంటే భారీ విషయం ఇంకోటి జరిగింది. అమెరికా అధ్యక్షుడు వాడే అధికారిక ఎయిర్ ఫోర్స్ వన్ విమానం బాగోలేదన్న ప్రిన్స్...రాయల్ ఫ్యామిలీ తరపున ట్రంప్ కి ఓ విమానాన్ని గిఫ్ట్ ఇవ్వాలని భావించారు. అందుకోసం ఏకంగా తమ కుటుంబానికి చెందిన బోయింగ్ 747 ను ట్రంప్ కు రాసిచ్చేందుకు అంగకరించారు. ఏకంగా 3300 కోట్ల రూపాయలు విలువ చేసే ఆ గిఫ్ట్ ని తీసుకుంటున్నట్లు ట్రంప్ వెంటనే అంగీకరించారు. పైగా అంత ఖరీదైన విమానం వద్దనటానికి నేనమన్నా మూర్ఖుడినా..కాకపోతే ఇంత ఆఫర్ చేయటం వెనుక ఏదైనా రాజకీయ దురుద్దేశం ఏమన్నా ఉందా మాత్రం చెక్ చేస్తామన్నారు ట్రంప్. ఇప్పుడు వాడుతున్న విమానం 40ఏళ్ల నాటి దన్న ట్రంప్...ఖతార్ రాయల్ ఫ్యామిలీ ఇచ్చే బోయింగ్ తీసుకుని..తను వెళ్లిపోయేప్పుడు అధ్యక్షుడి లైబ్రరీకి దాన్ని రాసిచ్చేస్తానని చెప్పారు.





















