అమెరికా నుంచి ఇండియాకి యాంటిక్ పీసెస్, మోదీ పర్యటనతో అంతా క్లియర్
ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల అమెరికా పర్యటన ముగిసింది. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర పరిణాం జరిగింది. భారత్‌లో దొంగిలించి...అక్రమంగా అమెరికాకి తరలించిన కొన్ని యాంటిక్ పీసెస్‌ని అమెరికా తిరిగి భారత్‌కి అప్పగించింది. మొత్తం 297 వస్తువులను తిరిగి ఇచ్చింది. ఇండియా నుంచి అక్రమంగా సాంస్కృతిక సంపదని దోచుకెళ్లారని, వాటిని తిరిగి ఇచ్చేయాలని ఎప్పటి నుంచో వాదనలు జరుగుతున్నాయి. ఇప్పుడు మోదీ పర్యటనలో భాగంగా ఈ సమస్య కొలిక్కి వచ్చింది. ఈ మేరకు ప్రధాని మోదీ స్పెషల్ పోస్ట్ పెట్టారు. ఈ భారతదేశ సంస్కృతిని ప్రతిబింబించే ఈ పురాతన వస్తువులను...తిరిగి ఇచ్చినందుకు జో బైడెన్‌కి థాంక్స్ చెప్పారు. ఈ యాంటిక్ పీసెస్‌తో కలుపుకుని..2014 నుంచి ఇండియాకి 640 వస్తువులు తిరిగి వచ్చాయి. వీటిలో ఒక్క అమెరికా నుంచే 578 వచ్చినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇప్పుడు అమెరికా తిరిగి ఇచ్చిన వస్తువుల్లో జైన్ తీర్థంకర, వేణుగోపాలుడి విగ్రహాలున్నాయి. వీటితో పాటు విష్ణువు, గణేశుడు, బుద్ధుడి విగ్రహాలూ ఉన్నాయి. మరి కొన్ని పాత్రలు, వస్తువులనూ అమెరికా..ఇండియాకి తిరిగి ఇచ్చింది. వీటిలో 4 వేల ఏళ్ల క్రితం నాటి వస్తువులూ ఉన్నాయని అధికారులు వెల్లడించారు.