సుబ్రమణ్యస్వామి క్వాష్ పిటిషన్‌పై విచారణ...
ఎయిర్ ఇండియా నుంచి పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని నిలిపివేయాలని కోరుతూ భాజపా ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్ పై దిల్లీ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. జనవరి 6న తీర్పు ఇవ్వనుంది. ఇవాళ జరిగిన వాదనల్లో స్వామి పిటిషన్ ను కేంద్రం వ్యతిరేకించింది. కేంద్ర ప్రభుత్వం తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా... పెట్టుబడుల ఉపసంహరణ విధాన నిర్ణయమన్నారు. ఎయిర్ ఇండియా వరుస నష్టాల్లో ఉందని, వాటిని ఇకపై భరించడం కేంద్రం వల్ల కాదన్నారు. బిడ్డింగ్ ప్రక్రియ ఏకపక్షంగా, రాజ్యాంగ విరుద్ధంగా, ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగ జరిగిందని సుబ్రహ్మణ్య స్వామి వాదించారు. టాటా సన్స్ సంస్థకు అనుకూలించేలా నిర్ణయం ఉందన్నారు. దివాళా ప్రక్రియ జరగుతున్నందున స్పైస్ జెట్ సంస్థ బిడ్డింగ్ లో పాల్గొనకుండా మద్రాస్ హైకోర్టు ఆదేశించిందన్నారు. అలాంటప్పుడు కేవలం టాటా సన్స్ మాత్రమే ఏకైక బిడ్డర్ గా బిడ్డింగ్ ను ఎలా చేపడతారని స్వామి వాదించారు. తాను పెట్టుబడుల ఉపసంహరణకు వ్యతిరేకం కాదని... పారదర్శక విధానంలో జరగాలని మాత్రమే కోరుతానన్నారు.





















