Spot Fixing Saga: స్పాట్ ఫిక్సింగ్ పై జింబాబ్వే మాజీ కెప్టెన్ స్టేట్ మెంట్
జింబాబ్వే మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్ స్పాట్ ఫిక్సింగ్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. స్పాట్ ఫిక్సింగ్ చేయాలని ఓ భారతీయ బిజినెస్ మ్యాన్ తనను సంప్రదించాడని, దాన్ని అప్పుడు ఐసీసీకి రిపోర్ట్ చేయలేకపోయానని ట్విట్టర్ ద్వారా తెలిపాడు. అందుకు తనపై కొన్నేళ్ల నిషేధం విధించే అవకాశం ఉందని వివరించాడు. కానీ తాను ఏనాడూ ఎలాంటి ఫిక్సింగ్ కు పాల్పడలేదన్నాడు. జింబాబ్వేలో ఓ టీ20 లీగ్ విషయమై చర్చించాలని, ఇండియాకు రావాలని, 15వేల డాలర్లు ఇస్తామని రెండేళ్ల క్రితం ఓ భారత బిజినెస్ మ్యాన్ ఆఫర్ ఇచ్చినట్టు టేలర్ తెలిపాడు. ఇండియాకు వచ్చిన తర్వాత ఓ పార్టీకి వెళ్లానని, అక్కడ అందరితో పాటు ఫూలిష్ గా కొకైన్ తీసుకున్నానని ఒప్పుకున్నాడు. ఇదంతా వారు వీడియో షూట్ చేసి.... తర్వాతి రోజు నా హోటల్ కు వచ్చి, స్పాట్ ఫిక్సింగ్ చేయకపోతే ఈ వీడియో పబ్లిక్ చేస్తామని బెదిరించినట్టు టేలర్ తెలిపాడు. ముందు చెప్పినట్టుగా 15వేల డాలర్లు ఇచ్చారని, స్పాట్ ఫిక్సింగ్ చేశాక ఇంకో 20వేల డాలర్లు ఇస్తామన్నారని వెల్లడించాడు. ముందు అక్కడి నుంచి తప్పించుకోవాలని ఫ్లైట్ ఎక్కి తిరిగి ఇంటికి వచ్చేశానన్నాడు. ఇదంతా మైండ్ లో ప్రాసెస్ చేసుకుని ఐసీసీకి రిపోర్ట్ చేయడానికి తనకు 4 నెలలు పట్టిందన్నాడు. వెంటనే రిపోర్ట్ చేయనందుకు తనపై కొన్నేళ్ల నిషేదం పడొచ్చని ట్విట్టర్ వేదికగా వివరించాడు.