Several students faint due to heatwave in Bihar school |హీట్ వేవ్స్ ధాటికి అల్లాడుతున్న విద్యార్థులు
మన దగ్గర ఎండకాలం ఐపోతుంటే... ఉత్తర భారత్ లో మాత్రం వేడి గాలులు వణుకు పుట్టిస్తున్నాయి. ఇక్కడ చూడండి.. ఆ వేడి తాపం తట్టుకోలేక స్కూల్ విద్యార్థులు ఎలా సొమ్మసిల్లి పడిపోతున్నారో..! వాళ్లను చూసి టీచర్లు ఆందోళన చెంది వారికి హుటాహుటిన ప్రథమ చికిత్స అందించారు. బెంచీలపై పడుకోబెట్టి... నీళ్లు తాపుతున్నారు. వెంటనే ఆటోల్లో దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన బిహార్ లోని షేక్ పూర్ ప్రాంతంలో జరిగింది. ఇదొక్క స్కూల్ అనే కాదు..చుట్టుపక్కల ఉన్న చాలా మంది స్కూల్ విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. ఐతే.. పిల్లలందరూ డీ హైడ్రేట్ అయ్యారని... ప్రస్తుతానికి క్షేమంగానే ఉన్నారని వైద్యులు చెబుతున్నారు.
బిహార్ లో ప్రస్తుతం హీట్ వేవ్స్ ఎక్కువగా వస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇదొక్క రాష్ట్రమే కాదు.. గుజరాత్, రాజస్థాన్, దిల్లీ, ఉత్తర ప్రదేశ్ లలోనూ హీట్ వేవ్స్ దడ పుట్టిస్తున్నాయి. కాబట్టి.. అవసరమైతే తప్ప ఎవరూ బయటికి రావొద్దని వైద్యులు సూచిస్తున్నారు. నీళ్లు ఎక్కువగా తాగాలని..విద్యార్థులు కచ్చితంగా వాటర్ బాటిల్ క్యారీ చేయాలని సూచిస్తున్నారు.