Top Reasons For BJP Failure In J&K | జమ్ముకశ్మీర్‌లో బీజేపీ ఎందుకు ఫెయిల్ అయింది | ABP Desam
జమ్ము కశ్మీర్ ఎన్నికల ఫలితాలు..బీజేపీకి గట్టి కుదుపే. నయాకశ్మీర్ నినాదంతో బరిలోకి దిగి క్లీన్ స్వీప్ చేస్తామని భావించిన కాషాయ పార్టీని ఓటర్లు ఎందుకో పెద్దగా ఆదరించలేదు. ఎన్నో ఏళ్లుగా రాజకీయ ప్రాబల్యం ఉన్న లోకల్ పార్టీ అయిన నేషనల్ కాన్ఫరెన్స్‌కే మద్దతునిచ్చారు. ఆర్టికల్ 370 రద్దు చేసిన తరవాత జరిగిన ఈ లిట్మస్ టెస్ట్‌లో..బీజేపీని..ప్రజలు ఎందుకు కాదన్నారు..? కశ్మీర్ కథ ఎందుకు అడ్డం తిరిగింది..? బీజేపీ ఓటమికి గల టాప్ రీజన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
పాయింట్ నంబర్ 1. 2015 ఎన్నికల సమయంలో లోకల్ పార్టీ పీడీపీతో పొత్తు పెట్టుకుంది బీజేపీ. కానీ ఈ సారి అలాంటిదేమీ లేకుండా చిన్నా చితకా పార్టీలతో చేతులు కలిపింది. మొత్తం పొలిటికల్ ముఖచిత్రాన్ని మార్చాలనుకున్నా..అది సాధ్యం కాలేదు. బహుశా బీజేపీ ఐడియాలజీని ప్రజలు ఓన్ చేసుకోలేకపోయారేమో. అందుకే..లోకల్ పార్టీల డామినేషన్‌తో బీజేపీ వెనకబడాల్సి వచ్చింది.
పాయింట్ నంబర్ 2: కశ్మీర్ లోయలో హింసను తగ్గించాలన్నది బీజేపీ పెట్టుకున్న మొదటి లక్ష్యం. ఈ విషయంలో కాస్త కఠినంగానే ఉంది. రాళ్లు రువ్వుకోవడం, ర్యాలీలు చేయడం, అల్లర్లకు దిగడం..ఇలాంటి వాటిని అసలు సహించలేదు. పూర్తిగా అణిచివేసింది. అయితే...దీని వల్ల ఎంత మేలు జరిగిందో..అంత నష్టమూ జరిగింది. ఈ స్థాయిలో అణిచివేయడం వల్ల తమ హక్కులనీ బీజేపీ ఇదే విధంగా తొక్కిపెట్టేస్తుందేమో అన్న భయం మొదలైంది. బీజేపీ అధికారంలోకి వస్తే తమకు స్వేచ్ఛ ఉండదన్న ఆందోళన పెరిగింది. ఇది కూడా కొంత వరకూ ఆ పార్టీని దెబ్బ కొట్టింది.