PM Modi on PoK Issue | ఉగ్రవాదులను, సపోర్ట్ చేసే వాళ్లను వేర్వేరుగా చూడం | ABP Desam
ఉగ్రవాదులను, వారికి మద్దతు అందించే దేశాలను వేర్వేరుగా చూడమని చెప్పారు ప్రధాని మోదీ. ఇకపై పాక్ పై చర్చలు జరిగితే అది ఉగ్రవాదం గురించేనని..పాక్ తో మాట్లాడితే అది పాక్ ఆక్రమిత కశ్మీర్ పై మాత్రమేనన్నారు ప్రధాని మోదీ. ఈ యుగం యుద్ధాలది కాదని..అలా అని ఉగ్రవాదులదీ కాదన్నారు ప్రధాని మోదీ. పాతికేళ్లుగా భారత్ పై కుట్రలు చేస్తూ పాక్ లో దర్జాగా బతికేస్తున్న ఉగ్రవాదులను ఒక్క దెబ్బతో మట్టిలో కలిపేశామన్నారు ప్రధాని మోదీ. ఆపరేషన్ సిందూర్ తో మా ఆడపడుచుల సింధూరాన్ని మీరు తొలగిస్తే...ఉగ్రవాద రాజధానిని, వందకు పైగా ఉగ్రవాదుల ప్రాణాలను గాల్లో కలిపేశామన్నారు ప్రధాని మోదీ. అణు ఆయుధాలున్నాయంటూ మరోసారి పాకిస్థాన్ బెదిరింపులకు దిగితే మొహం పగిలిపోయేలా సమాధానమిస్తామని ప్రధాని మోదీ హెచ్చరికలు జారీ చేశారు. భారత్ దాడులకు బ్రేక్ మాత్రమే ఇచ్చిందన్నారు ప్రధాని మోదీ. ఇదే విషయాన్ని మళ్లీ చెప్తున్నామన్న మోదీ...పాక్ కానీ..పాక్ ప్రేరిపిత ఉగ్రవాదులు కానీ తోకజాడిస్తే పరిణామాలను ప్రపంచం ఊహించలేదన్నారు. రెండు రాత్రుల్లో మనం ప్రతిజ్ఞ చేస్తే ఎలా ఉంటుందో...కోట్లాది ప్రజల భావోద్వేగం సాక్షిగా ఆపరేషన్ సిందూర్ తో ప్రపంచానికి తెలియచెప్పామని ప్రధాని మోదీ అన్నారు.





















