PM Modi on Donald Trump Mediation | ప్రపంచంలో ఏ దేశాధినేత భారత్ ను ఆపమని చెప్పలేదు | ABP Desam
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పటంతోనే ఆపరేషన్ సిందూర్ ఆగిందనే విమర్శలను ప్రధాని మోదీ కొట్టి పారేశారు. పార్లమెంటులో ఆపరేషన్ సిందూర్ పై మాట్లాడిన మోదీ..ప్రపంచంలోని ఏ దేశాధినేత కూడా భారత్ ను ఆపరేషన్ సిందూర్ ఆపమని చెప్పలేదన్నారు. ప్రపంచంలో ఏ దేశాధినేత కూడా భారత్ ను ఆపరేషన్ సిందూర్ ఆపమని చెప్పలేదు. మే9వ తారీఖు రాత్రి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ నాతో మాట్లాడటానికి ప్రయత్నించారు. ఆయన గంట సేపు ప్రయత్నం చేసినా నేను ఆ టైమ్ లో మన సైన్యంతో మీటింగ్ లో ఉండటంతో మాట్లాడలేకపోయాను. ఆ తర్వాత ఆయనకు తిరిగి ఫోన్ చేసి అడిగాను మీరు మూడు నాలుగు సార్లు చేశారు నేనిలా మీటింగ్ లో ఉన్నానని చెప్పాను. ఆయన నాతో చెప్పిన విషయం ఏంటంటే పాకిస్తాన్ మీ మీద భారీ దాడికి ప్లాన్ చేస్తోందని చెప్పారు. నేను చెప్పిన విషయం ఆయనకు అర్థమై ఉండదు. నా జవాబు ఏంటంటే పాకిస్తాన్ మా మీద దాడి చేయాలనుకుంటే ఇంకా భారీ మూల్యం చెల్లించుకుంటుంది. ఒకవేళ పాకిస్తాన్ దాడి చేస్తే అంతకంటే భారీ దాడి వాళ్ల మీద దాడి చేసి బదులు తీర్చుకుంటామని చెప్పాను. మేం తూటాకు సమాధానం తూటాతోనే చెప్తామని కూడా చెప్పాను. పాకిస్తాన్ కు మన సైనిక శక్తి ఏంటో చెప్పి చెప్పి వచ్చాం. ఇదే నా సమాధానం..మన దేశం సమాధానం కూడా.





















