Car Catches Fire Case:నెల్లూరు జిల్లా గొలగమూడి వద్ద కారు దగ్ధమైన కేసును చేధించిన పోలీసులు
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గొలగమూడి రైల్వే గేటు సమీపంలో కారుతో సహా కాలిబూడిదైపోయిన వ్యక్తి వివరాలను పోలీసులు కనుగొన్నారు. మృతుడిని నెల్లూకు చెందిన మల్లిఖార్జున్ గా పోలీసులు గుర్తించారు. కారులో కూర్చుని విండోస్ అన్నీ మూసేసుకుని సీటు బెల్ట్ పెట్టుకుని కారుతో సహా అగ్నికి ఆహుతైపోయినట్టు నిర్థారించారు. ఇది ఆత్మహత్యగా నిర్థారణకు వచ్చాకు పోలీసులు. నెల్లూరులో ఆర్కే జిరాక్స్ పేరుతో ఇతను ఓ జిరాక్స్ షాపు నడుపుతున్నారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. డీఎస్పీ హరినాథ్ రెడ్డి మృతుడి వివరాలు వెల్లడించారు. అయితే ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుడికి ఎవరితోనూ గొడవలు లేవనీ, కుటుంబ కలహాల వల్ల ఈ దుర్ఘటన జరిగిందేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు.





















