AP Night Curfew : ఏపీలో నైట్ కర్ఫ్యూను వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి తలపెట్టిన నైట్ కర్ఫ్యూ వాయిదా పడింది. సంక్రాంతి తర్వాత రాత్రి కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 18 నుంచి జనవరి 31 వరకు రాత్రి కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించింది. కర్ఫ్యూపై ఇచ్చిన ఉత్తర్వుల్లో సవరణ చేసింది. పండుగ వేళ పల్లెలకు పెద్దఎత్తున తరలివచ్చే అవకాశం ఉన్నందున, ప్రజలకు ఇబ్బందులు కలగకూడదనే కర్ఫ్యూ వాయిదా వేశామని మంత్రి ఆళ్లనాని వెల్లడించారు. ఏపీలో కరోనా కేసులు పెరుగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించింది. సోమవారం జరిగిన సమీక్షలో సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. రాత్రి కర్ఫ్యూ, థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ అమలు చేయాలని ఆదేశించింది. తాజా వైద్య ఆరోగ్యశాఖ కర్ఫ్యూపై మార్గదర్శకాలు జారీచేసింది.





















