ABP C-Voter Survey Says NDA To Win Again | మళ్లీ ఎన్డీఏకే పట్టకం కట్టనున్న దేశం?
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగియటంతో ఎగ్జిట్ పోల్స్ విడుదల అయ్యాయి. సీ ఓటర్ తో ఏబీపీ విడుదల చేస్తున్న ఎగ్జిట్ పోల్స్ విశ్లేషణ కోసం వీడియో చూడండి.
లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఇప్పుడందరూ ఎగ్జిట్ పోల్స్ గురించే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది..? ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి..అన్న లెక్కలపై పెద్ద చర్చే జరుగుతోంది. గతంతో పోల్చి చూస్తే ఈ సారి ఎగ్జిట్ పోల్స్‌పై ఆసక్తి రెట్టింపైంది. ABP CVoter Exit Poll 2024 లోనూ ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తం లెక్కలు చూస్తే NDA కూటమికి గరిష్ఠంగా 396 సీట్లు కనిష్ఠంగా 339 సీట్లు వచ్చే అవకాశం ఉందని ఏబీపీ సీ ఓటర్ ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడైంది. ఇది ప్రధాని మోదీ ముందు నుంచి ప్రచారం చేస్తున్న అబ్ కీ బార్ చార్ సౌ పార్ నినాదానికి చాలా దగ్గరగా ఉంది. మరో వైపు ఇండీ కూటమి దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పక్షాలను కలుపుకుని ఎన్నికలకు వెళ్లింది. ఈ కూటమికి కనిష్ఠంగా 122 ఎంపీ స్థానాలు గరిష్ఠంగా 167 స్థానాలు వచ్చే అవకాశం ఉందని ఏబీపీ సీ ఓటర్ ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడైంది.





















