MM Keeravani Father Passed Away | కీరవాణి తండ్రి కన్నుమూత
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఎంఎం కీరవాణి తండ్రి శివశక్తి దత్తా మణికొండలోని తన నివాసంలో కన్నుమూశారు. ఆయన అసలు పేరు కోడూరి సుబ్బారావు. ప్రముఖ పాన్ ఇండియా దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌కు సోదరుడైన శివశక్తి పలు తెలుగు సినిమాలకు పాటలు రాశారు. లిరిక్ రైటర్, స్క్రీన్ రైటర్, చిత్రకారుడిగా మంచి గుర్తింపు పొందారు.
1932 అక్టోబర్ 8న రాజమండ్రి సమీపంలోని కొవ్వూరులో శివశక్తి జన్మించారు. ఆయన అసలు పేరు కోడూరి సుబ్బారావు. అప్పట్లోనే ఇంటర్ చదువుకున్న ఈయన చిన్నప్పటి నుంచి కళలపై ఆసక్తితో ఇంటి నుంచి వెళ్లిపోయి ముంబయిలోని సర్ జెజె స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ కాలేజీ చేరారు. రెండేళ్ల తర్వాత మళ్లీ కొవ్వూరు తిరిగొచ్చి చిత్రకారుడిగా పని చేశారు. 'కమలేశ్' అనే కలం పేరుతో ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత మ్యూజిక్‌పై ఇష్టంతో సితార, గిటార్, హార్మోనియం నేర్చుకున్నారు.





















