Manchu Vishnu Argument with Media | జర్నలిస్ట్ తో విష్ణు గొడవ
మంచు మోహన్ బాబు తన కొడుకు కలిసి నిర్మించిన చిత్రం కన్నప్ప. ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చేసింది. రిలీజ్ కి ముందు కన్నప్ప టీం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్బంగా మంచు విష్ణు తెలంగాణ లో కన్నప్ప సినిమా టికెట్స్ రేట్స్ పై స్పందించారు. అలాగే ఈ సినిమాలో తన నలుగురు పిల్లలు నటించడం కూడా చాలా సంతోషంగా ఉన్నట్టు చెప్పుకొచ్చారు మంచు విష్ణు. తన భార్యని కూడా సినిమాలో నటించమంటే తంతా అని అన్నదని నవ్వుతు షేర్ చేసుకున్నారు. తన తండ్రి తనపై కన్నా ఈ సినిమా, స్టోరీపైనే నమ్మకంతో అంత డబ్బులు పెట్టారని అన్నారు మంచు విష్ణు. అయితే కన్నప్ప మైథాలజీ సినిమా అని ఎవరు రాయకండి అంటూ మీడియాకి చెప్పుకొచ్చారు విష్ణు. ఒక పాపులర్ థియేటర్ దెగ్గర గొడవలు జాగరబోతున్నట్టు తనకి ఇన్ఫర్మేషన్ ఉన్నట్టు చెప్పారు మంచు విష్ణు. ఈ ఫ్రైడే నాదే అంటూ తన సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు మంచు విష్ణు.





















