Tollywood Workers Strike | సినీ ఇండస్ట్రీలో మహిళా కార్మికుల దుస్దితిపై ప్రత్యేక కథనం | ABP Desam
సినీ కార్మికుల సమ్మె టాలివుడ్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది. గత ఐదు రోజులుగా సినీ ఇండస్ట్రీలో 24క్రాఫ్ట్ చెందిన కార్మికులు విధులు బహిష్కరించారు. సినీ నిర్మాతలు ఇచ్చిన హామీ పైప్రకారం.. మూడేళ్లకోసారి 30శాతం జీతాలు పెంచకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు సినీ నిర్మాతలు వెర్షన్ మరోలా ఉంది. ఇప్పటికే కార్మికుల సమస్యలపై చాలా సార్లు స్పందించామని సాఫ్ట్ వేర్ శాలరీలు ఇస్ుతన్నామంటూ ప్రొడ్యూసర్లు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తించాయి. కార్మికులు సినిమా షూటింగ్స్ బంద్ చేసి సమ్మెకు పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే కార్మికుల సమ్మెపై నిర్మాతలు పట్టువీడటంలేదు. అవసరమైతే కొత్తవారితో షూటింగ్స్ పూర్తి చేస్తామంటూ ప్రకటిస్తున్నారు. అందు తగినట్లుగా ప్రకటనలు జారీ చేస్తున్నారు. వెబ్ సైట్ల ద్వారా ఇండస్ట్రీలో పనిచేయాలనుకునే రావాలంటూ యాడ్స్ ఇస్తున్నారు. కానీ వాస్తవానికి తెలుగు సినీ ఇండస్ట్రీలో కార్మికుల సమస్యలేంటి, 24 క్రాఫ్ట్స్ లో భాగమైన సీని మహిళా కార్మికులు సమ్మెపై ఏమంటున్నారు.? టాలీవుడ్ లో మహిళా కార్మికుల సమస్యలపై ABP దేశం ప్రత్యేక కథనం..





















