Mana Shankar Varaprasad Garu Glimpse Review | మెగా 157 టైటిల్ గ్లింప్స్ రిలీజ్ | ABP Desam
డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా అంటేనే ఎంటర్టైన్మెంట్ అని ఫిక్స్ అయిపొయ్యారు సినిమా ఫ్యాన్స్. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి - వెంకటేష్ తో కలిసి అనిల్ రావిపూడి ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. చిరుకు జోడిగా నయనతార ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే కేథరిన్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే చిరు బర్త్ డే సందర్బంగా ఈ సినిమా టైటిల్ అండ్ గ్లింప్స్ ని రిలీజ్ చేసారు మేకర్స్.
మన శంకర వరప్రసాద్ గారు అనే టైటిల్ తో ఈ సినిమా 2026 సంక్రాంతికి థియేటర్స్ లో సందడి చేయనుంది. ఈ గ్లింప్స్ లో చిరంజీవి లుక్స్ అదిరిపోయాయి. గ్లింప్స్ చూస్తుంటే ఇదొక పక్కా కమర్షియల్, ఫ్యామిలీ కామెడీ సినిమా అని తెలుస్తుంది.
ఫుల్ సెక్యూరిటీతో గ్లాస్సెస్ పెట్టుకొని.. కార్ లో నుంచి దిగుతున్న చిరు ఎంట్రీ అదిరిపోయింది. బ్లాక్ కమాండోస్ మధ్య బాస్ ఎంట్రీని ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే గ్లింప్స్ లో సెక్యూరిటీ, కమాండోస్ ... ఇలా అందరు బాస్ చుట్టూ ఉండడంతో చిరు క్యారెక్టర్ పై ఆసక్తి నెలకొంది. 'మన శంకర వరప్రసాద్ గారు... పండక్కి వచ్చేస్తున్నారు' అంటూ విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్‌తో టైటిల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వడం మరింత హైప్ క్రియేట్ చేసింది. అలాగే హార్స్ పట్టుకొని పొగ మంచులో చిరు నడుచుకుంటూ వచ్చే లుక్స్ వింటేజ్ మెగా స్టార్ ని గుర్తు చేసాయి.
ఈ సినిమా అంనౌన్సమెంట్ జరిగినప్పటి నుంచి సంక్రాంతికి రప్ఫాడించేద్దాం అని అంటూనే ఉన్నారు డైరెక్టర్ అనిల్. ఇక ఈ గ్లింప్స్ ను చూసిన ఫ్యాన్స్ మాత్రం వచ్చే సంక్రాతి మెగాస్టార్ దే అంటూ ఫిక్స్ అయిపొయ్యారు.





















