Hero Naveen Chandra about Sandeep Kishan | కష్టంలోనూ తోడుండే ఫ్రెండ్ సందీప్ కిషన్ | ABP Desam
టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఎలెవెన్ సినిమాలో హీరోగా నటించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో సందీప్ కిషన్ పై నవీన్ చంద్ర ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. తనకు ఎప్పుడు అవసరం వచ్చినా ఎప్పుడు ఏం గుర్తొచ్చినా సినిమా ఇండస్ట్రీ లో తన కోసం ఉండే ఫ్రెండ్ సందీప్ కిషన్ మాత్రమే నన్నారు హీరో నవీన్ చంద్ర. 11 సినిమా కోసం ప్రమోషన్స్ కు ఎవరిని పిలవాలా అని ఆలోచించినప్పుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి తను వస్తానని మాట ఇచ్చిన సందీప్ కిషన్ అన్నట్లుగానే టైమ్ కి వచ్చి తనను బతికించాడంటూ వాళ్లిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్ షిప్ గురించి చెప్పారు నవీన్ చంద్ర. ఈ సినిమాపై తనకున్న బలమైన ఆత్మివిశ్వాసం నమ్మకం చూసి సందీప్ కూడా తనకు ధైర్యం చెప్పాడని ఈ సినిమా హిట్ అయితే ఇంత మంది నమ్మకాలు నిలబడతాయి అన్నారు నవీన్ చంద్ర.





















