Avatar 3 Trailer Review | అవతార్ 3 ట్రైలర్ రివ్యూ
హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ డైరెక్ట్ చేస్తున్న విజువల్ వండర్ అవతార్ 3. ఈ సినిమా కోసం ప్రపంచ దేశాల నుంచి అవతార్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అవతార్ మొదటి రెండు భాగాలు రిలీజ్ అయి పెద్ద హిట్స్ ని సాధించాయి. ఇప్పుడు అవతార్ 3 కూడా ఫ్యాన్స్ ను అక్కటుకోవడంలో ఎలాంటి సందేహం లేదని ట్రైలర్ చూస్తే అర్థం అయిపోతుంది. అవతార్: ఫైర్ అండ్ యాష్ టైటిల్‌తో థర్డ్ పార్ట్ థియేటర్స్ లోకి రానుంది. అయితే ఈ సంవత్సరం డిసెంబరు 19న ఈ సినిమా రిలీజ్ అవుతున్నట్టు ఆల్రెడీ ట్రైలర్ లో చెప్పేసారు. అవతార్ 3 ట్రైలర్ చూసిన ప్రతి ఒకరు ... జేమ్స్ కామెరూన్ విజువల్ మ్యాజిక్ లోకి వెళ్లిపోతున్నారు.
పండోరా అనే ఒక ఫిక్షనల్ ప్లానెట్ తో .... అందులో ఉండే ప్రకృతి అందాలతో అందర్నీ మెస్మరైజ్ చేసాడు డైరెక్టర్ జేమ్స్ కామెరాన్. రెండవ భాగం అవతార్ ది వే ఆఫ్ వాటర్ .... ఇక ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఫస్ట్ 2 పార్ట్స్ లో జేక్ ఫ్యామిలీ, హ్యూమన్స్ తో పోరాటం చేసింది. కానీ పార్ట్ 3లో అలా ఉండదట. ఈసారి ‘యాష్ వరల్డ్’ లోని ట్రైబ్స్ తో తలపడాల్సి ఉంటుంది. పాండోరాలోని భిన్న జీవన శైలుల మధ్య పోరాటాల్ని ఈసారి చూపించనున్నారు.
ఈ సీక్వెల్‌లో కొత్త విల్లన్ ‘వరంగ్’ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. వరంగ్ క్యారెక్టర్ చాలా మిస్టీరియస్‌గా, ఇంటెన్స్, డేంజరస్ గా ఉండబోతున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. యాష్ ప్రపంచంలోని ట్రైబ్స్ తో జేక్ కుటుంబం పోరాటం చేస్తుందని జేమ్స్ కామెరాన్ వివరించారు. తొలి పార్ట్‌లో భూమి, రెండో భాగంలో సముద్రం, ఇక ఇప్పుడు చంద్రుడిపై జరిగే యుద్ధాన్ని చూడనున్నామని ఆయన వెల్లడించారు. సినిమా ప్రపంచంలో అవతార్ అంటేనే ఒక సంచలనం. జేమ్స్ కామెరూన్ సృష్టించిన ఈ విజువల్ వండర్స్ ని మరే సినిమాల్లో మనం చూడలేము కూడా. అవతార్ ఫ్రాంచైజీలో రాబోయే 4th పార్ట్ 2029లో, 5th పార్ట్ 2031 డిసెంబరులో రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.





















