అన్వేషించండి
Anantapur News: అనంతపురంలో రోడ్డు ప్రమాదం... ఎదురెదురుగా రెండు ఆటోలు ఢీ... ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు
అనంతపురంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. నగర శివారులోని టీవీ టవర్ సమీపంలో సత్యసాయిబాబా కళాశాల వద్ద ఎదురుగా వచ్చిన రెండు ఆటోలు ఢీకొన్నాయి. దీంతో సమీపంలో ఉన్న ఇన్నోవా వాహనం పైకి ఆటోలు దూసుకెళ్లాయి. ఆటోలలో ప్రయాణికులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఒక ఆటోలో ఇద్దరూ, మరో ఆటోలో డ్రైవర్ మాత్రమే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఒక ఆటో డ్రైవర్ తీవ్రగాయాలయ్యాయి. ఆటోలో ఉన్న మరో వ్యక్తి కందుకూరుకి చెందిన శ్రీనివాసులు మృతి చెందారు. ఆటోలు వేగంగా రావడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్‌సిరీస్





















