(Source: ECI | ABP NEWS)
Crypto Currency : పార్లమెంటులో డిజిటల్ కరెన్సీ నియంత్రణ బిల్లు-2021
కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. శీతకాల సమావేశాల్లో క్రిప్టో కరెన్సీ, అధికారిక డిజిటల్ కరెన్సీ నియంత్రణ బిల్లు-2021 ప్రవేశపెట్టనుంది. దీని ప్రకారం ఆర్‌బీఐ పరిధిలో అధికారిక సొంత డిజిటల్ కరెన్సీ రానుంది. భారత్‌లో మిగతా అన్ని ప్రైవేటు క్రిప్టో కరెన్సీలపై నిషేధం విధించనున్నారు! ఇందుకు సంబంధించిన పూర్తి ఫ్రేమ్‌వర్క్ బిల్లులో ఉంటుంది. శీతకాలం సమావేశాల్లో మొత్తం 26 బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఇందులో భాగంగానే భారత్ క్రిప్టో కరెన్సీ నియంత్రణ బిల్లుపై చర్చించి ఆమోదించనున్నారు. అంతేకాకుండా బ్యాంకింగ్ చట్టాల్లో సవరణలు, రెండు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం వంటి కీలక బిల్లులు ఉన్నాయి





















