(Source: ECI/ABP News/ABP Majha)
YSRCP Sajjala Ramakrishna Reddy On AP Elections Countering |కౌంటింగ్ రోజుపై సజ్జల కీలక వ్యాఖ్యలు
ఏపీ ఎన్నికల ఫలితాల రోజున వైసీపీ ఎజెంట్లు అనుసరించాల్సిన వ్యుహాలపై సజ్జల రామకృష్ణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
అన్యాయం జరిగింది కాబట్టి రీ పోలింగ్ అడిగామని, టీడీపీ ఎందుకు రీ పోలింగ్ అడగలేదని సజ్జల ప్రశ్నించారు. మా కార్యకర్తలపై జరిగిన దాడులపై ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నికల కమిషన్ బాబు వైరస్ తో ఇన్ఫెక్ట్ అయిందన్నారు. బాధితులకు పార్టీ తరపున అండగా నిలుస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆదుకుంటామన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేసేందుకే కేంద్రంలో ఉన్న పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నట్లుందన్నారు.
పోస్టల్ బ్యాలెట్‌లో ఓట్లు తమకే పడ్డాయని టీడీపీ ప్రచారం చేసుకుంటోందని ..కానీ ఉద్యోగులంతా తమ వెనుకే ఉన్నారని సజ్జల అన్నారు. పోస్టల్ బ్యాలెట్ కు లేనిపోని నిబంధనలు అంటగడుతున్నారని సజ్జల మండిపడ్డారు.పోస్టల్ బ్యాలెట్ పై సీఈఓ నిబంధనలకు విరుద్ధంగా ఆదేశాలు ఇచ్చారన్నారు. బీజేపీ తో చంద్రబాబు పొత్తు తర్వాత బాబుకి అనుకూలంగా ఈసీ వ్యవహరిస్తుందని ఆరోపించారు. సీఎస్ ను తప్పించాలనే టార్గెట్ తో రెండు నెలలుగా ప్రయత్నం చేస్తున్నారని సజ్జల ఆరోపించారు. ఉగ్రవాది లాగా సిఎస్ పై దాడి చేస్తున్నారన్నారు.