1983నుంచి టీటీడీలో ఉదయాస్తమాన సేవలున్నాయి
టీటీడీపై కొందరు స్వాములు మిడిమిడి జ్ఞానంతో వ్యాఖ్యలు చేస్తున్నారని టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు పోకల అశోక్ కుమార్ ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోకల అశోక్ కుమార్ ఉదయాస్తమాన సేవపై ఇటీవల్ల కిష్కింధ క్షేత్రం పీఠాధిపతులు గోవిందానంద సరస్వతి స్వామి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.....గోవిందానంద సరస్వతి వ్యాఖ్యలు ఖండిస్తున్నామని, ఉదయాస్తమాన సేవ అంటే ఏంటో ఆయనకు తెలియదన్నారు. ఇవాళే మొదలెట్టినట్లు, డబ్బుల కోసం టీటీడీ చేస్తున్నట్లు దుష్ప్రచారం చేయడం సబబు కాదన్నారు. 1983లోనే టీటీడీ ఉదయాస్తమాన సేవలు ప్రారంభించిందని వివరించారు. 2006లో డొనేషన్స్ ఆగిపోయాయని, వీటి లైఫ్ టైం 25 ఏళ్ళు మాత్రమే ఉంటుందని,ప్రస్తుతం 531 ఖాళీలు ఏర్పడ్డాయని, 2006లో పది లక్షలకు పెంచడం జరిగిందన్నారు. చిన్న పిల్లలకు వైద్యం కోసం ఉదయాస్తమాన సేవల ద్వారా వచ్చిన విరాళాన్ని కేటాయించాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించిందన్నారు. టీటీడీపై మాట్లాడాలని పూర్వఫలాలు తెలుసుకోకుండా మాట్లాడం మంచి పద్దతి కాదని విమర్శించారు..రాష్ట్రపతులు., వివిధ దేశాధినేతలు టీటీడీ పాలనకు కితాబు ఇస్తుంటే, మిడిమిడి జ్ఞానం కలిగిన స్వాముల ఆరోపణలు హాస్యాస్పదం ఉందన్నారు.