అన్వేషించండి
Deepika Padukone At Tirumala: కాలినడకన తిరుమల చేరుకున్న దీపికా పదుకొణె
తిరుమల శ్రీవారి దర్శనార్థం ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొణె తిరుమలకు చేరుకున్నారు. గురువారం రాత్రి అలిపిరి కాలిబాట మార్గం గుండా గోవింద నామస్మరణ చేస్తూ సామాన్య భక్తులతో కలిసి మూడున్నర గంటలపాటు నడుచుకుంటూ తిరుమలకు చేరుకున్నారు. నడకమార్గంలో నడుచుకుంటూ వస్తున్న దీపికతో సెల్పీలు దిగేందుకు భక్తులు ఉత్సాహం చూపించారు. అనంతరం తిరుమలలోని రాధేయం అతిథిగృహం చేరుకున్న దీపిక..... ఇవాళ రాత్రి తిరుమలలో బస చేసి, శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకోనున్నారు.
వ్యూ మోర్





















