అన్వేషించండి
Nellore: కొవిడ్ ఆంక్షలతో పోలేరమ్మ జాతర.. దర్శనాలకు అనుమతి ఇవ్వకపోవడంపై భక్తుల ఆగ్రహం
నెల్లూరు జల్లా వెంకటగిరిలో అమ్మగారి ఇంటి వద్ద ప్రత్యేక గదిలో పోలేరమ్మ అమ్మవారి ప్రతిమ తయారు చేసిన తర్వాత పోలీసు బందోబస్తు మధ్య అమ్మవారి విగ్రహాన్ని జీనిగల వారి వీధిలోని అత్తగారింటికి తీసుకొచ్చారు. అక్కడ సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించారు. కన్నులను అలంకరించారు. దిష్టి చుక్క పెట్టారు. దిష్టి చుక్క పెట్టిన అనంతరం అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించారు.. ఇక జీనిగల వారి వీధిలోని అత్తగారింటినుంచి అమ్మవారి ప్రతిమను గుడి వద్దకు ఊరేగింపుగా తీసుకొచ్చి, తాత్కాలికంగా అక్కడ ప్రతిష్టించారు. రాత్రి నుంచి అమ్మవారి దర్శనాలు మొదలయ్యాయి.
వ్యూ మోర్





















