నెల్లూరు: భార్య చేతికి చిక్కి కటకటాల పాలయ్యాడు
నెల్లూరు జిల్లా వాకాడు చెందిన గులాబ్ జానీ భాష 2012లో తాను పోస్టల్ డిపార్ట్మెంట్ లో ప్రభుత్వ ఉద్యోగినని నమ్మించి గూడూరు చెందిన ఓ మహిళ ను వివాహం చేసుకున్నాడు. అప్పటినుండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం వచ్చిందని మరోసారి ఎస్వీ యూనివర్సిటీలో లెక్చలర్ జాబ్ చేస్తున్నానని ఐడి కార్డులు చూపించి భార్య తల్లిదండ్రుల వద్ద భారీ మొత్తంలో నగదు తీసుకుని సంవత్సరానికి ఒక ఊరు మారుతూ కొత్తగా విజయవాడలోని ఒక గృహం అద్దెకు తీసుకొని జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల ఓ ప్రైవేట్ బ్యాంకు లో ఇన్సూరెన్స్ చేసిన గులాబ్ జానీ విలాసాలకు బానిసై తాను బ్రతికుండగానే కొంత మంది ప్రభుత్వ ఉద్యోగులతో కలిసి చనిపోయినట్లుగా మరణ ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేపించాడు.





















