అన్వేషించండి
CCTV Visuals Attack On TDP Leader Anam Venkata Ramanareddy: వైసీపీపై మండిపడుతున్న ప్రతిపక్షాలు
టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డిపై ముసుగులు వేసుకుని మరీ కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో నమోదైంది. టీడీపీ కార్యకర్తలు తరిమేసరికి దుండగులు పరారయ్యారు. దాడి తర్వాత ఆనం వెంకట రమణారెడ్డిని... ఆనం రామనారాయణరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తదితరులు పరామర్శించారు. దాడిలో గాయపడ్డ సికిందర్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశామని, అయినా వారిపై తమకు నమ్మకం లేదని ఆనం వెంకట రమణారెడ్డి అన్నారు.
వ్యూ మోర్





















